అక్షరాలతో ఆటలు బడిలో చేరగానే…

Mar 31,2024 10:39 #Children, #Sneha

ఇప్పటి కాలంలో పిల్లలకు మూడు, నాలుగు సంవత్సరాలు నిండగానే బడిలో చేర్చుతున్నారు తల్లిదండ్రులు. పసిబిడ్డలు బడిలో చేరగానే పలకమీద అక్షరాలు రాసిచ్చి దిద్దమంటాం. కొద్దిసేపు దిద్దుతారు. మనం మళ్లీ దిద్దమంటాం. ఎందుకు దిద్దాలి? ఎంతసేపు దిద్దాలి? పిల్లలు విసిగిపోతారు. అక్షరాల మీద వ్యతిరేకత పుడుతుంది. ఏడాది గడిచినా అక్షరాలను విడిగా గుర్తించలేరు, రాయలేరు. దీంతో చివరకు మొద్దుగా తయారవుతారు. బడి అంటే కోపం, చిరాకు వస్తుంది. బడికి వెళ్లను అని ఏడుస్తారు. అందుకే వారి చేత ఏదీ బలవంతంగా దిద్దించకూడదు.
ఆసక్తి కలిగించేలా అక్షరాలతో ఉన్న బొమ్మలు, జంతువుల చిత్రపటాలు చూపించాలి. ఆ బొమ్మల్లో ఏఏ జంతువులు, వస్తువులు ఉన్నాయో చెప్పమనాలి. వాటిని ఎలా పలకాలో చెప్పాలి. పిల్లలు కాళ్లు, చేతులు, శరీరం కదిలిస్తూ బొమ్మలు వేయించాలి. ఆటలు ఆడించాలి. ఇలా చేస్తూ ఉంటే వారికి ఉత్సాహం కలుగుతుంది. ఏడ్వకుండా స్కూలుకు వస్తారు.

➡️