గెస్‌ యువర్‌ సీడ్స్‌!

Jan 5,2025 11:03 #Sneha

‘సృజనోత్సవం’ అనేది మా స్కూల్లో జరుపుకునే వార్షిక దినోత్సవం. ఈ సంవత్సరం నేను ఒక వాలంటీర్‌గా పని చేశాను. మా టీచర్లకి, మిగతా వాళ్ళకి కావలసిన చిన్న చిన్న సహాయాలు చేయడం నిజంగా మంచి అనుభవం. సాయంత్రం ఎన్జీసీ స్టాల్‌ దగ్గర వాలంటీర్‌గా చివరి వరకు ఉన్నాను. సీడ్స్‌ విషయంలో ‘గెస్‌ యువర్‌ సీడ్స్‌-గ్రాబ్‌ యువర్‌ గిఫ్ట్‌’ అనే ఒక చిన్న ఆటలాగా నిర్వహించాము. చాలామంది పిల్లలు, ప్రోగ్రాం చూడడానికి వచ్చిన పెద్దలు కూడా అవి ఏం సీడ్స్‌ కనుక్కోవడానికి చాలా ఆసక్తి చూపించారు. చాలామంది పిల్లలకి ఆ సీడ్స్‌ ఏంటో కనిపెట్టడం కష్టం అయింది. అన్ని సీడ్స్‌ గెస్‌ చేసి చెప్పిన వారికి మేము మట్టిలో కలిసిపోయే పేపర్‌ పెన్‌ని గిఫ్ట్‌గా ఇచ్చాము. ఎన్జీసీ స్టాల్‌ దగ్గర చాలాసేపు మా అమ్మ, నాన్న కూడా నాతో ఆ స్టాల్లో ఉన్నారు. సాయంత్రం గెస్ట్‌గా వచ్చిన ఒక ఆవిడ ఆ సీడ్స్‌ కనిపెట్టి చెప్పారు. ఈ విధంగానైనా నాకు కూడా నిజంగా చాలా సీడ్స్‌ పేరు తెలుసుకునే అవకాశం దొరికింది.

కె. వసుధ,
7వ తరగతి,
అరవింద హైస్కూల్‌,
కుంచనపల్లి, గుంటూరు జిల్లా.

➡️