ఈ గుండె ఎక్కడెక్కడ తిరుగుతున్నా
మనసు చంపుకొని మౌనంగా ఉన్నా,
రెండు కళ్ళలో రెండు దృశ్యాలు
కన్నీటిగా కదలాడుతూనే ఉన్నాయి!
కలలోనైనా ఊహించామా,
గుండె నిండా నింపుకునే గురువుకు
గురుదక్షిణగా చెప్పుదెబ్బ లభిస్తుందని,
ఒక్కసారిగా
గురువుల తలలన్నీ తెగిపడి
పాతాళంలోకి కూరుకుపోయాయి!
కలలోనైనా ఊహిస్తామా
కులం, మతం లేని సమాజాన్ని,
ఇంకా ఎన్నాళ్ళని
మతం మానవత్వాన్ని
తూటాల లెక్కన కొలుస్తుంది,
ప్రాణం తీస్తే మతం గెలుస్తుందా!
ఎన్ని పాఠాలు చెప్పినా
ఎన్ని నీతిబోధలు విన్నవించినా
నాగరికత పెరిగేకొద్దీ
అనాగరికులం అవుతున్నాం,
ఎవరికీ ఏమీ కాని
భవిష్యత్ ఎలా ఉండబోతుందో
కళ్ళ ముందు కనిపిస్తోంది!
భూమ్మీద ఎవరూ లేరు
ఉన్నదంతా మనమే,
ప్రకతిలో మార్పు లేదు
మనమే వికతమవుతున్నాం!
అసలు మనుషులు
దేనికోసం వెతుకుతున్నారో
కానీ మనుషులకు మిగిలేది
చివరికి మనుషులే…
ఇంకేం లేదు, రాదు, ఉండదు !
– పుట్టి గిరిధర్
9494962080