ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉండే శారద చిన్ని హ్యాపీ జీవితంలోకి ఒక కష్టం వచ్చింది. దాన్ని ఎదుర్కోగల ధైర్యం తనకి ఉందని బయటకి చెప్తున్నా, లోపల కొండంత గుబులు. కాసేపు తనని, ఇంకాసేపు ఇంట్లోవాళ్ళని, మరికొంతసేపు పక్కవాళ్లని, తరువాత ఏకంగా ప్రపంచాన్నే, ఇలా అందరినీ బ్లేమ్ చేసుకుంటూ, ఒక సంధ్య వేళ ఆలోచిస్తూ అలా నడుస్తూ వెళ్తోంది.
ఆ దారిలో నల్ల ఆకాశం లాంటి పల్చటి చీకటిలో చంద్రుడిలా మెరుస్తున్న బుల్లి పిల్లిపిల్ల కంటపడింది. తనపై పడుతున్న ఆకు చిగుర్లతో ఆడుకుంటూ, ఎంతో ముద్దుగా తన కాలిని నోటితో నాకుతూ, తన చెవిపై ఉన్న చిన్ని వెంట్రుకల్ని సరిచేసుకుంటోంది. ఆ ప్రశాంతమైన దృశ్యాన్ని ధ్వంసం చేయడానికి వచినట్టు వచ్చింది, దాని వెనకాలే తరుముతున్న ఓ పెద్ద జీవి. అప్పటిదాకా ప్రశాంతంగా చూస్తున్న శారదకు అప్పుడు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఆ పిల్లిపిల్ల తన ప్రాణానికై పెట్టిన పరుగుల మధ్యలో ఆగి, దారిలో కనబడిన శారద బాధ ముఖం చూసి, తన వైపు వచ్చి ఇలా అన్నట్టు అనిపించింది.
Hey, life is not as easy as you think it is for many of us out there, its often tough and full of misfortunes that we keep enduring every second of living. So, oh poor thing, stop complaining, get going! And as always, we gotta run, oh but of course, with a smile no matter what, bye and take care;
అంతే అది చూసి, చిన్నప్పుడు మోకాలికి అయిన పెద్ద గాయం, అమ్మ గట్టిగా తిడితే ఏడ్చిన ఆరోజు, కొత్త స్కూల్లో ఎదురుకున్న బుల్లీయింగ్, ఎంత చదివినా కూడా స్కూల్లో వచ్చిన సిక్స్త్ ర్యాంక్, ఒకరోజు స్నేహితులతో జరిగిన పెద్ద గొడవ, ఎంతో ఇష్టపడి చదివిన కల వర్కౌట్ అవ్వదని తెలిసిన ఆ క్షణం, ఎంతో కష్టపడినా దొరకని ఆ ఒక్క ఇంటర్వ్యూ ఛాన్స్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ పెద్ద పేద్ద కష్టం, అలా అప్పుడు ఎంతో కష్టంగా అనిపించిన కెరటాలంతటి పెద్ద కష్టాలు, ఇప్పుడు దూరంగ వచ్చి చూస్తున్నకొద్దీ, మంచు బిందువులంత చిన్నగా, తెలికగా మారి నేలను హత్తుకుని వెళ్లిపోతున్నాయి. అసలు అవి కష్టాలేంటి, అది ఎప్పుడూ ఉండే నా హాయైన, పైకెత్తి ఉత్సాహంతో నింపేసి, అంతలోనే కష్టపెట్టి నేలకువంచే జయింట్ వీల్ ప్రయాణం లాంటిది. పైకి వెళ్ళడానికి భయపడి కిందే ఉండిపోయిన వారికి ఆకాశం రుచి తెలీదు. సాహసం చేసి పైదాకా వెళ్ళినవారే ఆ క్షణకాలపు తాత్కాలిక స్పైసీ విజయం రుచి చూడగలరు. అలా అని మళ్లీ నేలకు పడిపోతూ, మళ్లీ పైకెళుతూ, ఇదే కదా మరి అనుకుంది శారద.
సాయి మల్లిక పులగుర్త