కనువిందు చేసే కైగల్‌ జలపాతం..

Mar 31,2024 10:56 #Sneha, #tourism

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి పంచాయతీ పరిధిలో ఉన్న కైగల్‌ గ్రామంలో ఈ జలపాతం ఉంది. ఇది ఆంధ్ర,తమిళనాడు, కర్ణాటక – మూడు రాష్ట్రాలకు సంబంధించి ఉంది. ఇది కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యం మధ్యలో ఉంది. దీనిచుట్టూ ఉన్న కైగల్‌ గ్రామం నుండి దానికి ఆ పేరు వచ్చింది. పర్యాటకులను ఆకర్షించే ఈ జలపాతం 219 జాతీయ రహదారి నుండి సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. స్థానికంగా దుముకురాళ్లు జలపాతాలు అని పిలుస్తారు. కైగల్‌ జలపాతాలు శాశ్వతమైనవి. జలపాతం మూడు క్యాస్కేడింగ్‌ ఫాల్స్‌గా విభజించబడింది. నీరు సుమారు 40 అడుగుల ఎత్తు నుండి పడుతుంది. నీరు దిగువకు చేరి, అనేక చిన్న కొలనులను ఏర్పరుస్తుంది. వేసవిలో తప్పక వెళ్లాల్సిన జలపాతాల్లో ఇదొకటి. ఎండాకాలంలో ఈ జలపాతం ఆహ్లాదాన్ని పంచుతూ సేదతీరుస్తుంది.

➡️