మోషాయి.. ద్వేషాయి..

Apr 14,2024 00:13 #Kavitha

నా పేరేదైతే మోషాయి..
నా పేరెనుక తోకేదైతే నీకెందుకు చెప్పాలోయి..
నా భాషేదైతే మోషాయి..
దాని యాసేదైతే నీకెందుకు చెప్పాలోయి..
నా మతమేదైతే మోషాయి..
నా గతమేదైతే నీకెందుకు చెప్పాలోయి..
నా పౌరుసత్వం అడుగుడెందిరా మోషాయి
మతమేదైతే.. గతమేదైతే.. ఏంటి..
అతుకుల బంత కింద బతుకులు తెల్లారుతున్నాయి.. చూడవోయి..
మోషాయి.. ద్వేషాయి.. పోవోయి.. ||2||

నువ్వు లీడరువైతే ఏంది మోషాయి..
నీ లక్ష్యం ఏదైతే మాకెందుకోయి..
నువ్వు ఇల్లదిలి వస్తే ఏమిటోయి ..
భార్యను చూడకుండ ఉండుటలో ఏంటి నీ బడాయి..
దేశ పౌరాలమా అని అడుగుతావేందోయి..
రెచ్చగొట్టి ఈ చిచ్చుపెట్టుదేందిరోయి..
చూస్తూ వూరుకోమురా నీ లడాయి..
తేల్చి లెక్క చెప్తామురా మోషాయి..
మోషాయి.. ద్వేషాయి.. పోవోయి.. ||2||

నీ మతతత్వ బోధలేంది మోషాయి..
పరమతము పడనియ్యవుగా ద్వేషాయి..
మీరు రెచ్చగొడితే మేము రెచ్చిపోవుడు ఏందిరో.. చల్‌..
తరిమి తరిమి కొడతామురోయి..
మోషాయి.. ద్వేషాయి.. పోవోయి.. ||2||

నీ జెండా రంగేదైతే మోషాయి..
నీ హిందూత్వ ఎజెండా దేశమంత ఎందుకోయి..
బిన్నత్వంలో ఏకత్వం మనదోయి..
హేయి.. కులము.. మతమొదిలి రండోయి
మనసారా అలుముకుందాము ..
మోషాయి.. ద్వేషాయి.. పోవోయి.. ||2||
(రామ్‌ మిర్యాల పాటకు ప్యారడీ..)

శాంతిశ్రీ
8333818985

➡️