బాలల్లారా
భావి భారత పౌరుల్లారా
రండోయ్ రారండోయ్..
ఉషోదయపు ఉషస్సులై
పరుగు పరుగున రారండోయ్..
చాచా హృదయ సీమనేలిన
గులాబీల్లారా
కలాం కలలుగన్న
ఆశాజ్యోతుల్లారా
రండోయ్ రారండోయ్..
ఉషోదయపు ఉషస్సులై
పరుగు పరుగున రారండోయ్..
కులమతాల కోటగోడలు
పగులగొట్టి
మనమంతా ఒకటని
కోటి గొంతుకలతో నినదించగా
రండోయ్ రారండోయ్..
పేరుకున్న పేదరికపు
పునాదులు పెకిలించి
సమసమాజ స్థాపనే ధ్యేయంగా
పదునెక్కిన ఆలోచనలతో
రండోయ్ రారండోయ్..
– కాసర లక్ష్మీ సరోజా రెడ్డి,
జంగారెడ్డిగూడెం.