చలికి సూప్‌ చేసేద్దాం ..

Dec 8,2024 13:42 #ruchi, #Sneha, #sunday book

చలికాలం.. ఈ వాతావరణంలో ఏమి తినాలన్నా నోటికి రుచించవు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మరింత ఇబ్బంది. వారికి నీరసం రాకుండా పోషకాలు అందించాలంటే.. చలి బారి నుండి బయటపడాలంటే.. వేడి వేడిగా ఉండే సూప్స్‌ అయితే.. అందరికీ హాయిగా ఉంటుంది కదా! ఈ సూప్స్‌ రోగ నిరోధకశక్తిని పెంచుతాయి కూడా. మరి ఆరోగ్యకరమైన సూప్స్‌ను ఎలా తయరుచేయాలో తెలుసుకుందాం.

కూరగాయలతో..
కావలసినవి : క్యాబేజీ  1/4 ముక్క, బీన్స్‌ా10, క్యారెట్‌ా ఒకటి, క్యాప్సికమ్‌ాఒకటి, ఉల్లిపాయాఒకటి, అల్లాం అంగుళం ముక్క, వెల్లుల్లి రెబ్బలుా5, ఉప్పుా తగినంత, వెన్నాస్పూను, మిరియాల పొడిా1/2 స్పూను, కొత్తిమీర తరుగుా కొంచెం

తయారీ : క్యాబేజీ, బీన్స్‌, క్యారెట్‌, క్యాప్సికమ్‌, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్‌ చేసుకోవాలి. పాన్‌లో నెయ్యి వేసి, వేడి చేయాలి. అందులో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ, మిగిలిన కూరగాయ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి మధ్యలో కలుపుతూ ఉడికించాలి. ముక్క మెత్తబడుతుండగా ఉప్పు, లీటరు నీటిని పోసి మరో పది నిమిషాలు ఉడికించాలి. ఇందులో స్పూను కార్న్‌ఫ్లోర్‌ను పావు కప్పు నీటిలో కలిపి సూప్‌ మరిగేటప్పుడు పోస్తూ, నెమ్మదిగా కలుపుతూ ఉడికించాలి. సూప్‌ చిక్కబడగానే మిరియాల పొడి, కొత్తిమీర తరుగు చల్లుకుని దింపేయాలి. (మనకు ఏ కూరగాయలు అందుబాటులో ఉంటే వాటితో ఇలా సూప్‌ చేసుకోవచ్చు)

ఆకు కూరలతో..
కావలసినవి : ఆకుకూరల తరుగు (తోటకూర, పాలకూర, బచ్చలి, చుక్కకూర…)ా కప్పు, జీలకర్రా1/2 స్పూను, ఉల్లిపాయాఒకటి, పచ్చిమిర్చిా4, వెల్లుల్లి రెబ్బలుా4, వెన్నా స్పూను

తయారీ : మనకు అందుబాటులో ఉన్న ఏ ఆకు కూరలతోనైనా ఇలానే చేసుకోవచ్చు. బాండీలో వెన్న కరిగించి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి, దోరగా వేయించాలి. దీనిలో ఆకుకూర, ఉప్పు వేసి మూత పెట్టి కొద్దిసేపుఉడికించాలి. దీన్ని తాగే వేడితో గ్లాసు నీటితో మెత్తగా మిక్సీ పట్టి సర్వ్‌ చేసుకోవటమే. అంతే ఆరోగ్యాన్ని అందించే ఆకుకూరల సూప్‌ రెడీ.

పుట్టగొడుగులతో..
కావలసినవి : పుట్టగొడుగులుా500గ్రా, వెన్నా50 గ్రా, వెల్లుల్లి రెబ్బలుా6, ఉల్లిపాయలుా2, ఉప్పుా తగినంత, మిరియాల పొడిా 1/2 స్పూను, నీళ్ళు 1/2 లీ.

తయారీ : శుభ్రం చేసుకున్న పుట్టగొడుగులు, ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. బాండీలో వెన్న వేడి చేసి ఉల్లి, వెల్లుల్లి ముక్కల్ని వేసి, దోరగా వేయించాలి. దానిలో పుట్టగొడుగు ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి ఉడికించాలి. తర్వాత నీళ్ళు పోసి పది నిమిషాలుంచాలి. వీటిని చల్లార్చి మెత్తగా మిక్సీ పట్టాలి. అదే బాండీలో ఈ మిశ్రమానికి మరో కప్పు నీటిని కలిపి ఉడికించాలి. సూప్‌ కాగగానే దించి, కొత్తిమీర తరుగు చల్లి సర్వ్‌ చేసుకోవాలి.

నాన్‌వెజ్‌తో..
కావలసినవి : మాంసాం150 గ్రా., వెన్నాస్పూను, ఉల్లిపాయాఒకటి, చిన్న క్యారెట్‌ా ఒకటి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌ాస్పూను, ఉప్పుా తగినంత, మిరియాల పొడిాస్పూను, టమాటా, సోయా, చిల్లీ సాస్‌లుాస్పూను చొప్పున, వెనిగర్‌ాస్పూను, గుడ్డుా ఒకటి, కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమాం1/4కప్పు

తయారీ : బాండీలో వెన్న కరిగించి మాంసాన్ని దానిలో మూడు నిమిషాలు వేయించాలి. అందులో నీరంతా ఇగిరిపోయాక క్యారెట్‌, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి ఉడికించాలి. తర్వాత లీటరు నీటిని పోసి కుక్కర్‌లో నాలుగు విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించాలి. తర్వాత మెత్తగా ఉడికిన మాంసం ముక్కలను ఆ నీటి నుంచి వేరుచేసి వేళ్ళతోనే చిన్నచిన్న ముక్కలుగా చేయాలి. ఈ ముక్కలు అదే నీటిలో వేసి మిరియాల పొడి, టమాటా, సోయా, చిల్లీ సాస్‌లు, వెనిగర్‌ కలిపి మరో మూడు నిమిషాలు ఉడికించాలి. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లి సర్వ్‌ చేయాలి.

➡️