సాహితీ సంద్రం

Jun 9,2024 07:43 #Poetry, #Sneha

అలల్లా ఆలోచనలు
ఆవిర్భవిస్తున్నాయి
బడబాగ్నిలా భావాలు
భగభగలాడుతున్నాయి
చినుకుల్లా అక్షరాలు
కురుస్తున్నాయి
పైరగాలిలా పదాలు
ప్రసరించుతున్నాయి
పాలు చిలికినట్లుగా
మనోమదనము సాగుతుంది
వెన్నలా కవిత్వము పుట్టుకొస్తుంది
జలచరాల్లా కవులు ఈదుతున్నారు
రత్నాల్లా కవితలను వెలువరించుతున్నారు
సముద్రాన్ని చూచి సాహిత్యాన్ని చదివి
సంతసపడండి
కవుల వ్రాతలు పఠించి కవనలోతులు పరికించి
కుతూహలపడండి

– గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్‌

➡️