ప్రేమ

Jun 9,2024 11:59 #Sneha

కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉండేది
ఎలాంటి కొలతల్లో కొలవలేనిది
పురిటి నొప్పులను కూడా మరిపించేది
చావును సైతము ఎదిరించేది
నీది నాదని భేదము లేనిది.
మాటలకందనిది, మమతను పెంచేది
రాయిని కూడా రంజింప చేసేది
స్వార్థానికి తావులేనిది, లోభానికి లొంగిపోనిది
కనిపించని భావము, త్యాగానికి అర్థము
కుల మతాలని ఎరుగనిది
పేద, గొప్ప చూడనిది
భాష లేనిది, బంధం ఉన్నది
ఈ సృష్టిలో విలువైనది ప్రేమ
కలకాలం నిలిచి ఉండేది ప్రేమ

– ఎన్‌. హారిక,
10వ తరగతి,
తెలంగాణ ఆదర్శ పాఠశాల,
బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా.

 

➡️