నివాళి

Mar 31,2024 10:14 #Poetry, #Sneha

మౌనో.. జ్ఞానో..
సహనమో.. సాహసమో..
అతడు నిర్భంధంలో..
చేయనినేరంతో జైలుగోడల్లో..
ఒక వీక్షణం.. దశాబ్దాల నిరీక్షణం..
మోపిన అభియోగాలన్నీ
తప్పుల తడకైతే.. కళ్ళు తెరిచిన కోర్టు
ప్రదర్శించిన మానవత్వం
మరణానంతర నిర్దోషిత్వం
తెగిపడ్డ పువ్వు తిరిగి
చెట్టును చేరగలదా..!
రాలిపడ్డ చుక్క రాత్రికి
ఆకసాన్ని చేరి వెలగగలదా..!
మనిషికి ఒకటే జీవితం
మరెప్పటికీ తిరిగిరాని జీవనం
మిత్రులతో అభిమానులతో
ఏ అనుభవాలు పంచుకోలేదు
ఏ పాపం చేయలేదు
తల్చుకొని భార్య మది..
కురిసిన మేఘమైంది!
సహచరుని గుండెచప్పుడు
కుమిలి కుమిలి నెమరేసుకోవడం
జతగాని ఉచ్చ్వాసనిశ్వాస
మరీమరీ గుర్తుచేసుకోవడమే
ఆమెకు మిగిలింది..!
ఆమె జీవనం.. నడిసంద్రంలో నావ
రేయింబవళ్ళు నడిచినా
గమ్యం చేరని తోవ..!

కోటం చంద్రశేఖర్‌, 9492043348

(ఢిల్లీ సాయిబాబాతో పాటు అరెస్టు చేసిన పాండు నరోటే కేసు మధ్యలోనే మృతి చెందిన ఆవేదనతో..)

➡️