నిష్ఫలం

Mar 31,2024 10:33

జానమ్మ దొడ్డిలో
జామ చెట్టుంది!
కాసినా కాయల్ని
కోసి అమ్మింది!!

అందనంతెత్తులో
ఉంది కాబట్టి
అది ఒకటి మాత్రమే
వదిలి పెట్టింది!!

ఉడుత ఆ పండుకై
ఉరుకులెత్తింది!
చెంగు చెంగున ఎగిరి
చెట్టు ఎక్కింది!!

‘ఎంత బాగుంటుందో
ఎపుడు తింటానో??’
అనుకొంటూ లాగితే
అదిరి జారింది!!

చేజారినా పండు
చెట్టు దరినున్న
మురుగుకాల్వలో పడి
మునిగిపోయింది!!

ఫలితమా నిష్ఫలం
బాధ మిగిలింది!
ఉడుత కడు నిరాశతో
ఉడికి పోతోంది!!

– ‘బాలబంధు’, అలపర్తి వెంకట సుబ్బారావు.
94408 05001

➡️