నువ్వే నువ్వే..!

Feb 11,2024 11:39 #Poetry
poetry on poetry

నాలోని కళని గుర్తించింది నువ్వే

నాలోని భ్రమలను తుంచిందీ నువ్వే

ఇలలో నాకొక గుర్తింపు తెచ్చింది నువ్వే

కలం పట్టించి ముందుకు నడిపిందీ నువ్వే!

నా కథలలో పాత్రల కదలిక నువ్వే

నా కవితలో ప్రాసకు ప్రాణం నువ్వే

నా రచనలను రక్తికట్టించింది నువ్వే

నా వర్ణనలకు వన్నెలద్దిందీ నువ్వే!

నా కళ్ళలో కాంతిని నింపింది నువ్వే

నా ఆలోచనలకు పదును పెట్టిందీ నువ్వే

నన్ను మురిపించే మధుర పలుకులు నీవే

నాకు మన్నన పెంచిందీ నువ్వే!

నువ్వుకాదంటే కలం కదలదంతే

నువ్వు  లేకుంటే మట్టి బొమ్మనంతే

నువ్వు  లేని జన్మ నాకొక వింతే

ఓ చదువులమ్మా..!

నీకు వేనవేల వందనాలమ్మా..!!

  • ధూళిపాళ్ళ మాధవీ కిషోర్‌
➡️