తెలుగునాట సాంస్కృతిక రంగం ... కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంతో చైతన్య పుంతలు తొక్కింది. ప్రజాకళలు ప్రవర్ధమానమయ్యాయి. జానపద కళల్లో పురాణ కథల స్థానే ప్రజా సమస్యలు చోటు సంపాదించు కున్నాయి.
నేడు ప్రపంచంలోని ఏ దేశమేగినా, ఏ ప్రాంతమెళ్లినా రెపరెపలాడుతూ అరుణ పతాకం కనిపిస్తుంది. కార్మిక రాజ్యాలు ఉన్నా, పోయినా ఎర్రజెండా లేకుండా ఎగురుతూనే ఉంటుంది.
సమాజాన్ని విప్లవాత్మకంగా పరివర్తన గావించాలన్న పార్టీ లక్ష్యం వర్గ, ప్రజా ఉద్యమాలతో ముడిపడి ఉంది. పార్టీ చరిత్రను అధ్యయనం చేస్తే మనకు గత అనుభవాలు, ముఖ్యమైన గుణపాఠాలు ఆయుధాలుగా లభిస్తాయి.
పీడితులనూ, దోపిడీకి గురయ్యేవారినీ, కార్మికులనూ, రైతాంగాన్నీ సమీకరించడం ద్వారా కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్య్ర పోరాటాన్ని బలోపేతం చేయడానికి ఎలా కృషి చేసిందో ఈ చిన్న పుస్తకం వివరిస్తుంది.