ఉషోదయపు కాంతిపుంజం

Dec 1,2024 08:25 #kavithalu, #Sneha

ఆమె గుమ్మం దాటేందుకు ఎన్ని ఆంక్షలుండేవో
ఆమె రాయాల్సిన డైరీ పేజీలన్నీ
అతడి ఆజ్ఞలతో విలవిల్లాడేవి..
విసిగిపోయిందో
వికసించాలనే ఆశ కలిగిందో
ఇప్పుడు అంతరిక్షంలోకి దూసుకెళుతోంది
హరివిల్లు రంగుల్ని అద్దుకుంటూ..
తారల తళుకుల్ని అందుకుంటూ..
నిజానికి ఆమెనెవరూ ఆపలేకపోయారు
అందానికి తప్ప ఇంకెందుకూ
పనికిరాదని తీర్మానించిన వేళ
వేల సమూహాలైనా
నడిచే దారుల నిండా
అనుమానపు ముళ్ళని పరిచిన అసూయపరులైనా
ఆమె పోటీని పరిహసిస్తూ
ఆమె విజయాన్ని అడ్డుకోలేకపోయారు..
ఇప్పుడామె పర్వత శిఖరాలను
పట్టుదలకు పర్యాయపదమై అధిరోహిస్తోంది..
వీలైతే శిఖరాగ్రంపై పాతడానికి
ఆమె చేతిలో మనం
విజయ పతాకలమై మిగిలిపోదాం..

ఎన్‌ లహరి
9885535506

➡️