ఇంటీరియర్ డెకరేషన్‌లో క్రిస్టల్స్‌తో తయారుచేసిన కృత్రిమ పండ్ల ఆకృతుల అందం చూడముచ్చటగా ఉంది. డైనింగ్ టేబుల్‌పై అసలైన పండ్లలా కనిపించే వివిధ రకాల క్రిస్టల్ పండ్లను అమర్చి, అలంకరించడం ఇంటీరియర్‌ను ద్విగుణీకృతం చేస్తుంది. యాపిల్, ద్రాక్ష, స్ట్రాబెర్రీ.. పైనాపిల్.. ఇలా పండు ఏదైనా క్రిస్టల్‌గా మెరవాల్సిందే! ఇక్కడ క్రిస్టల్ పండ్లను చూస్తుంటే ఎంత ముచ్చటగొలుపుతున్నాయో కదా..!
