శివానీ ప్రతిభ

Jun 9,2024 11:56 #Sneha

‘అయ్యయ్యో! బ్రహ్మయ్యా
అన్యాయం చేశావేమయ్యా!’
అన్న పాట టీ.వీలో
విన్నదేమో శివానీ!

ఆటలాడుతూ శివాని
ఆత్రంగా పరుగెత్తగ
చేజారీ మట్టిబొమ్మ
చిట్లిపోగ కిందపడీ!

అలవోకగా నాయనమ్మ
‘అయ్యయ్యో’ అనగానే
‘బ్రహ్మయ్యా’ అని శివాని
పాటను పూరించిందీ!

అప్రయత్నముగ చూపిన
ఆ ప్రతిభకు నాయనమ్మ
ఎదటనే వున్న శివానీ
నుదుట ముద్దు పెట్టింది!

– అలపర్తి వెంకటసుబ్బారావు
9440805001

➡️