గూర్ఖా..!

Nov 26,2023 09:37 #Sneha

నిశిరాత్రి నిశ్శబ్దంతో
పన్నెండు గంటల ప్రయాణం
మధ్య మధ్యలో ఉన్నట్టుండి
ఆకాశంలో మెరిసే మెరుపుల్లా
కుక్కల అరుపులు
వణుకు పుట్టించే చలి
సందట్లో సడేమియాలా
దోమల బెడద.. ఎంత విదిలించినా
ముసురుతూనే.. వీడని నీడలా..
ఓ పక్క నుంచీ..
మురికి కాలువ వాసన
భార్యాబిడ్డల కోసం
జీవన భత్యం కోసమైనా
మన రక్షణ దాగుందిగా
ఎంత త్యాగమయుడు?
గుర్తించాల్సిన బాధ్యత మనదే! మనదే!

– యలమర్తి అనూరాధ, 9247260206