ఊపిరి పోరాటం..

Sep 29,2024 09:33 #Poetry

దేశం భరించలేని బాధ?
ఓ కన్నీటిచుక్క రూపంలో
ఆమెని మింగేసింది.

చీకటి కాపలా కాసిన నరకానికి
సిగ్గుపడ్డ పగలు
నిజాలకు చిక్కి శల్యమైనది.

మంచం పట్టిన నమ్మకం
మరణశయ్యపై చేరి
దేశాన్ని ఓ మాట అడిగింది..

ఆడపిల్ల ‘ఊపిరి పోరాటం’
చేయాలా? అని.
సిగ్గుతో దేశం చచ్చిపోయింది..
శ్రీ సాహితి
9704437247

➡️