యానిమల్స్‌కు సూపర్‌పవర్స్‌ !

జంతువులకు ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. దట్టమైన అడవుల్లో సైతం జీవించడానికి ఇవి ఎంతగానో సహాయపడుతున్నాయట. ఈ సామర్థ్యాలు వివిధ అంశాలుగా ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు, శారీరక శక్తి, శరీర భాగాలను పునరుత్పత్తి చేసే సామర్థ్యం తదితరాలు. ఈ సూపర్‌ పవర్స్‌పై ఇప్పుడు సాంకేతికపరమైన అధ్యయనాలు జరుగుతున్నాయి. ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ యానిమల్స్‌’ ప్రాజెక్ట్‌ ద్వారా పక్షులు, జంతువులు, కీటకాలకు ఉన్న సూపర్‌ పవర్స్‌ను గుర్తించి, వాటి మనుగడకు ఉపయోగపడేలా చేసే ప్రయత్నమని చెప్పవచ్చు.

‘వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌’ చేసిన విశ్లేషణ ప్రకారం గత 50 సంవత్సరాలలో 73 శాతం వన్యప్రాణులు అంతరించిపోయాయని అంచనా. ఇంటర్నెట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ ప్రాజెక్ట్‌ ద్వారా జంతు వలసలు, అంతరించిపోతున్న జాతులు, ప్రపంచ పర్యావరణ అసమతుల్యతకు వాటి జీవన విధానంలో జరుగుతున్న మార్పులు తదితర అంశాలపై అధ్యయనం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇంటర్నెట్‌ అంటే…3-అక్షరాల (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు వరల్డ్‌ వైడ్‌ వెబ్‌) సూత్రీకరణ. ఇది విశ్వవ్యాప్తంగా గుర్తించబడిన గుర్తు. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల జీవనం సంక్షోభంలో ఉంది.

ఇంద్రియాలు..
పక్షుల్లో అతినీలలోహిత కిరణాల కాంతిని చూడగలిగే శక్తి ఉంది. ఇలా మానవులు చూడలేరు. గుడ్లగూబలు తమ తలను 270 డిగ్రీలు తిప్పగలవు.

శారీరక శక్తి..
సింహాలు వాటి శరీర బరువుకు దాదాపు రెండింతల బరువును (450 కిలోల వరకు) ఎత్తగలవు. చిరుతలు గంటకు 75 మైళ్ల వేగంతో పరిగెత్తగలవు. పెరెగ్రైన్‌ ఫాల్కన్‌ అనే పక్షి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనది. ఇది అధిక వేగంతో డైవ్‌ చేసి ఎరను పట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది.

పునరుత్పత్తి..
ఆక్సోలోట్‌లు అవయవాలను, వెన్నెముక భాగాలను పునరుత్పత్తి చేసుకోగలవు. అంతేకాక ఇతర జంతువులను ప్రాణాంతకం కలిగించే తీవ్రమైన గాయాల నుండి కోలుకునేలా చేసే శక్తి ఉంది.

ఇతర సామర్థ్యాలు..
ఉడుములు వేటాడే జంతువులను దూరంగా ఉంచడానికి పుర్రెలు తమ తోక కింద ఉన్న గ్రంథుల నుండి దుర్వాసనతో కూడిన ద్రవాన్ని చిమ్ముతాయి. ఆర్కిటిక్‌ నక్కలు వెంట్రుకలను కలిగి ఉంటాయి. ఇవి శీతాకాలంలో తెల్లగాను, వేసవిలో గోధుమ రంగులోకి మార్చుకోగలవు. కటిల్‌ ఫిష్‌ తమ చర్మంలోని ప్రత్యేక కణాలను ఉపయోగించి త్వరగా వాటి చర్మం రంగును, ఆకృతిని మార్చగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మిమిక్‌ ఆక్టోపస్‌ ఇతర జంతువులను అనుకరిస్తుంది. అదే జంతువు అరిచినట్లు భ్రమింప చేయగలదు. ఎలక్ట్రిక్‌ ఈల్స్‌ శత్రువులను ఆశ్చర్యపరిచేందుకు, దూరంగా ఉంచడానికి శక్తివంతమైన విద్యుత్‌ షాక్‌లను ఉత్పత్తి చేస్తాయి.

జంతువుల ఇంటర్నెట్‌..
ఉపగ్రహ ఆధారిత వ్యవస్థకు అనుసంధానంగా ఉంటుంది ఈ జంతువుల ఇంటర్నెట్‌. జంతువుల సామర్ధ్యాల గురించి మరింత తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్ట్‌ శాస్త్రవేత్తలకు బాగా సహాయపడుతుంది. డేటా నెట్‌వర్క్‌ను రూపొందించడానికి ఎలక్ట్రానిక్‌ ట్యాగ్‌లు, ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నారు. అతి చిన్న ఏకకణ జీవుల నుండి పెద్ద భూచర జీవుల వరకూ మరింత సమాచారం ఈ ప్రాజెక్ట్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అవి పెంపుడు జంతువులు కావచ్చు.. మనం ఆహారంగా తీసుకునేవి కావచ్చు.. సైంటిఫిక్‌ అధ్యయనాలకు వినియోగించే జంతువులు కావచ్చు. జంతువులపై ఇప్పటివరకు జరిగిన సంక్లిష్టమైన పరిశోధనలు సులభతరమయ్యే అవకాశం ఉంది.

సెన్సార్‌ ట్యాగ్స్‌తో..
చిన్న, తేలికైన ట్రాన్స్‌మిటర్స్‌, సెన్సార్‌ ట్యాగ్స్‌ను జంతువులకు అమర్చుతారు. ఈ ట్యాగ్స్‌ జంతువుల కదలికలు, ఆరోగ్యం గురించిన డేటాను సేకరించి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర యాంటెన్నాకు (ఐఎస్‌ఎస్‌) పంపుతాయి. అక్కడి నుంచి గ్రౌండ్‌ స్టేషన్‌కు చేరిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు కంప్యూటర్‌ల ద్వారా పరిశోధన కోసం సమీకరిస్తారు. దీనిని మూవ్‌బ్యాంక్‌ డేటాబేస్‌లో ప్రచురిస్తారు. సెన్సార్లు, కమ్యూనికేషన్‌ పరికరాల వంటి కొత్త సాంకేతిక పరికరాలతో.. అధికస్థాయి వైర్‌లెస్‌ డిజిటల్‌ నెట్‌వర్క్‌లతో ఇంటర్నెట్‌ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. జంతువులపై చేసే అధ్యయనాన్ని ‘ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌’ (ఐఓటి) అంటారు. ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ ఫర్‌ యానిమల్‌ రీసెర్చ్‌ యూజింగ్‌ స్పేస్‌ (ఐసిఎఆర్‌యుఎస్‌) ద్వారా పర్యవేక్షించడానికి, గ్లోబల్‌ యానిమల్‌ అబ్జర్వేషన్‌ నెట్‌వర్క్‌ను రూపొందించడానికి ఈ సాంకేతికతను ఉపయోగించాలనేది సంస్థ లక్ష్యం.

➡️