ప్రపంచవ్యాప్తంగా చూస్తే మానవుని మరణాల్లో 80 శాతం హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారే. గుండెపోటు (హార్ట్‌ఎటాక్)తో మరణాలే ఎక్కువగా ఉన్నాయని గణాంకాల ద్వారా తెలుసుకోవచ్చు. గుండెపోటుకు ప్రధానకారణం గుండెకు దారితీసే రక్తనాళాల్లో కొవ్వు అడ్డుపడటం. ఇలాంటివి ముందుగానే గుర్తించేందుకు ఏడాదికి ఒక్కసారైనా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవటం మంచిది. గుండె జబ్బులకు దారితీసే పరిస్థితులను నిపుణుల సలహాతో ముందుగానే గుర్తించి, అరికట్టొచ్చు. ధూమపానం చేయటం, శారీరక శ్రమ చేయకపోవటం, అధిక బరువు కూడా గుండె వ్యాధులకు దోహదం చేస్తాయి. హృదయ ఆరోగ్యానికి దోహదపడే వాటిలో కొలెస్ట్రాల్, రక్తపోటు, గ్లూకోజ్ నియంత్రణ ముఖ్యం. గుండె సంబంధిత వ్యాధుల్లో స్ట్రోక్, పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు, రిథమ్ డిజార్డర్లు, సబ్‌క్లినికల్ అథారోస్క్లెరోసిస్, కరోనరీ ఆర్టోరీ వ్యాధి, హార్ట్ ఫెయిల్యూర్, అనూరిజం (రక్తనాళాలు), ఫెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వంటివి కూడా ఉంటాయి.
శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె
మానవుడి శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె. శరీరానికంతటికీ రక్తాన్ని సరఫరా చేయటమే కాకుండా అనేక రకాల విధులను హృదయం (గుండె) నిర్వర్తిస్తుంది. అయితే దాని నిర్వాహణ తీరుపైన ఒత్తిడి పెంచితే వ్యాధులబారిన పడతాం. సరైన ఆహారపు అలవాట్లు, మెరుగైన జీవనశైలి, ప్రశాంతమైన వాతావరణంలో ఉండగలిగితే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరబోవు. ప్రపంచ హృదయ దినోత్సవం (వరల్డ్ హార్ట్ డే) సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
నేడున్న సమాజంలో ప్రతిఒక్కరూ ఉరుకులూ, పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు. అవసరం ఉన్నా, లేకపోయినా ఇలాగే జరుగుతుండటాన్ని నేను స్వయంగా గమనించా. ఇంకా ఏదో సాధించాలనీ, మరింత సంపాదించాలనీ, సమాజంలో ఉన్నతంగా ఉండాలని అనుకోవటంలో తప్పు లేదు. కానీ ఆ ఒత్తిడి మితిమీరితే గుండెపైనా ఆ భారం పడుతుంది. మానవ శరీరంలో ప్రతి చర్యా హృదయ స్పందన నుంచే వ్యక్తమవుతుంటుంది. అందుకే మానవుని మనుగడకు గుండె చాలా కీలకం. మనుషులు బతకటానికి రక్తాన్ని పంపిణీ చేయటమే కాకుండా, లయబద్ధంగా గుండె విధులను సైతం నిర్వహిస్తుంటుంది. మనిషి శరీరంలో ఉండే సుమారు 75 ట్రిలియన్ల కణాలకు అవసరమైన ఆహారాన్ని గుండె సరఫరా చేస్తుంది. శరీరంలో అద్భుతంగా పనిచేసే యంత్రం గుండె. అది పనితీరుని, హృదయ స్పందనను బట్టి గుండె కొట్టుకునే శబ్ధం వినిపిస్తుంది. పిడికిలి పరిమాణంలో గుండె ఉంటుంది. అది 60 వేల మైళ్ల వరకూ రక్త నాళాల ద్వారా రక్త ప్రసరణ చేసి, అవయవాల్లోని ప్రతి కణానికి రక్తం అందేలా చేస్తుంది. సాధారణంగా మానవుల గుండె శిశువు గర్భంలో ఉండగానే పని ప్రారంభిస్తుంది.
యువతలో పెరుగుతున్న హృద్రోగాలు
గత కొంతకాలంగా పరిశీలిస్తే చాలామందిని గుండె సంబంధిత వ్యాధులు వేధిస్తున్నాయి. ఆయా కేసులు పెరుగుతుండటం కూడా ఆందోళనకరమే. ప్రధానంగా యువకులు, మధ్య వయస్కులు గుండెపోటు, గుండె కవాటాలు దెబ్బతినటం, గుండె వైఫల్యంతో సహా వివిధ గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఆందోళనకరమైన విషయం ఏమంటే యువకులు గుండె జబ్బులతో బాధపడుతుండటం.
హృదయ సంబంధిత వ్యాధులు
మనిషి సగటు జీవితకాలంలో గుండె సుమారుగా 2.5 మిలియన్ల సార్లు కొట్టుకుంటుందని అంచనా. అంటే రోజుకు సుమారు లక్ష సార్లు కొట్టుకుంటుంది. పురుషులతో పోల్చితే మహిళల్లో గుండె కొట్టుకోవటంలో వేగంగా ఎక్కువ. స్త్రీలలో నిముషానికి 78 సార్లు, పురుషుల్లో 70 సార్లు గుండె కొట్టుకుంటుంది. గుండెలోని నాలుగు కవాటాలు మూసుకుని, తెరుచుకోవటం వల్ల శబ్ధం వినిపిస్తుంది. రోజుకు 2000 గాలన్ల రక్తాన్ని శరీరం మొత్తానికి గుండె పంపిణీ చేస్తుంది. మనుషులు బతికినంత కాలం గుండె రక్తాన్ని శరీర భాగాలకు చేరుస్తూ ఉంటుంది. మనిషి తన సాధారణ జీవితంలో సుమారు మూడు ఆయిల్ ట్యాంకర్ల కన్నా ఎక్కువ మొత్తంలో రక్తాన్ని అవయవాలకు పంపిణీ చేస్తుంటుంది. గుండెకు ఏదైనా ప్రమాదం జరిగితే రక్త పంపిణీలో అవకతవకలు ఏర్పడతాయి. కవాటాలు రక్తం పంపిణీ చేయకపోవటం వంటివి కూడా చోటుచేసుకుంటాయి. ఇలాంటి క్రమంలో గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి.
చికిత్సాపద్ధతులు
మొదటగా గుండె సంబంధిత వ్యాధులు, వాటి లక్షణాల గురించి తెలుసుకోవటం ఎంతైనా అవసరం. రోగం ముదిరే వరకూ ఆలస్యం చేయకుండా సకాలంలో గుండె సంబంధిత నిపుణులైన వైద్యుల వద్ద పరీక్షలు చేయిస్తే ఆరోగ్య సమస్యలు ఏమిటనేది తెలుస్తుంది.గుండె జబ్బుల లేదా నష్టాన్ని నివారించటానికి అనేక వైద్య పద్ధతులు ఉన్నాయి. పరీక్షలూ ఉన్నాయి.
రక్త పరీక్ష : మొదటగా అనుమానం వచ్చినప్పుడు కొలెస్ట్రాల్ ఎంత వుందనేది తెలుసుకోవటానికి రక్త పరీక్ష చేస్తారు. రక్త పరీక్షల్లో కూడా షుగర్, ట్రోపోనిన్, సికెఎంఆర్, సిఆర్‌టి, బిఎన్ పరీక్ష చేస్తారు.
ఎలక్ట్రో కార్డియో గ్రామ్ : గుండె ఎలా కొట్టుకుంటుందో, దాని విధులను ఎలా నిర్వర్తిస్తుందో తెలుసుకోవటానికి దోహదపడే పరీక్ష ఇది. ఈ పరీక్ష చేసే సమయంలో శరీరంలోని వివిధ భాగాల్లో చర్మంపై ఎలక్ట్రోడ్లు ఉంచుతారు. గుండె కొట్టుకునే ప్రతిసారీ, చర్మం, గుండె నుంచి విద్యుత్ సంకేతాలను గ్రహించి, చర్మానికి అనుసంధానింపబడిన సెన్సార్‌లకు సిగల్స్‌ను పంపుతుంది. దీనిద్వారా గుండె ఆరోగ్యంగా పనిచేస్తుందా? లేదా? అనేది గుండెలోని ఏభాగం ప్రభావితమవుతుందో తెలుసుకోవచ్చు.
ట్రెడ్‌మిల్ టెస్ట్ (ఒత్తిడి పరీక్ష) : సాధారణంగా ఇసిజి తీసుకున్న తర్వాత, గుండె దెబ్బతినదు. కానీ గుండె దెబ్బతిన్నట్లు అనుమానం వచ్చినా లేదా ఏమైనా లక్షణాలు ఉంటే ఎకో కార్డియోగ్రామ్ టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది. ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తితే గుండె రక్త సరఫరాలో లోపాలు తెలుస్తాయి. ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అనేది రికార్డు చేసే పరీక్ష. ట్రెడ్‌మిల్‌పై వేగంగా పరిగెత్తినప్పుడు మానిటర్ హృదయ స్పందన రేటులో మార్పులను గుర్తిస్తుంది. గుండె కండరాలకు తగినంత రక్తం అందకపోతే ఇసిజిలో మార్పులు బ్లాక్స్‌ను పసిగడతాయి.
కరోనరీ యాంజియోగ్రామ్ : యాంజియోగ్రామ్ అని పిలువబడే ఎక్స్ రే టెక్నాలజీ గుండెలోని రక్త నాళాలను పరిశీలించటానికి దోహదపడుతుంది. గుండె, రక్త ప్రసరణకు ఏమైనా ఆటంకం ఏర్పడితే తెలుసుకోవటానికిగాను ఈ పరీక్ష చేస్తారు.
కార్డియాక్ ఎంఆర్‌ఐ (గుండె కణజాల పరీక్ష) : గుండె సాధారణంగా శరీరంలోని ఇతర భాగాల ఎంఆర్‌ఐ పరీక్ష మాదిరిగా ఉంటుంది. గుండె అనేది ఎముకలు లేని కండరాలు, కణజాలాలతో కూడిన ఒక అవయవం. ఎంఆర్‌ఐ గుండె మృదుకణజాలాలకు జరిగిన నష్టాన్ని గుర్తించటానికి నిర్వహిస్తారు. ఈ యంత్రం నుంచి వెలువడే అయస్కాంత తరంగాలు గుండె కణజాలం ఆరోగ్యంగా ఉందో లేదో రికార్డు చేస్తుంది.
కరోనరీ కంప్యూటెడ్ టోమోగ్రఫీ యాంజియోగ్రామ్ :
ఇది గుండెలోని ధమనులు కుంచించుకుపోయాయో, దెబ్బతిన్నాయో తెలుసుకోవటానికి చేసే పరీక్ష. కంప్యూటెడ్ టోమోగ్రఫీ శరీరంలోకి ఇంజెక్ట్ చేయబడిన రసాయనం ద్వారా గుండెలోని ధమనిలో ఏభాగాన్ని ప్రభావితం చేస్తుందో గుర్తించొచ్చు. ఇది ఎక్స్‌రే, 3డి కంప్యూటర్ టెక్నాలజీ కలయిక.
టిల్ట్ పరీక్ష : మొదడుకు రక్త ప్రసరణ తగ్గటం లేదా చాలా తక్కువ రక్తపోటు కారణంగా మూర్ఛ వస్తుంది. దీన్నే సింకోప్ అని అంటారు. మూర్ఛ పోవటానికి గల కారణాన్ని తెలుసుకోవడానికే టిల్ట్ టెస్ట్ చేస్తారు. నిలబడి, కూర్చోవడం, పడుకోవడం, రక్తపోటు, హృదయ స్పందన రేటు, గుండె వివిధ విభాగాలు ఎలా పనిచేస్తున్నాయో గుర్తించటం వంటి వివిధ శరీర స్థానాల్లో పరీక్షించొచ్చు.
జబ్బు ముదరకుండా చూసుకోవాలి
గుండె జబ్బుల్లో అనేక రకాలున్నాయి. వాటిని సకాలంలో గుర్తించి, జబ్బు స్థాయి ఏమిటో తెలుసుకుని, సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయం తొలుగుతుంది. జబ్బు ముదిరిన కొద్దీ నిర్ధారణ తేలికైనా, చికిత్స కష్టం. ఆ జబ్బు ఎందుకు వచ్చిందో తెలుసుకుని, కారణానికి చికిత్స చేయనంతకాలం కష్టం. ఏ రోగికైనా మాసివ్ హార్ట్ ఎటాక్ వచ్చి, గుండె బాగా దెబ్బతిని పెద్దదైందనుకోండి. అప్పుడు గుండెకు శస్త్ర చికిత్స చేసి, కొంత కండరాన్ని తీసేస్తారు. గుండె పరిమాణాన్ని తగ్గిస్తే ఆ రోగికి మళ్లీ బాగా స్వస్థత చేకూరే అవకాశం ఉంది. ఇవేవీ పనిచేయలేదనుకుంటే అప్పుడు గుండె మార్పిడి గురించి ఆలోచించాలి. 55 ఏళ్ల లోపు వయస్సు వారు మిగతా అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటే గుండె మార్పిడి శస్త్ర చికిత్సకు అర్హులు.
98 శాతం గుండె శస్త్ర చికిత్సలు విజయవంతం
గుండె రంధ్రాలను మూయటం, కవాటాలను (వాల్స్) మార్చడం, బైపాస్ సర్జరీ లాంటి శస్త్ర చికిత్సలు చాలా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం గుండె శస్త్ర చికిత్సల్లో కొత్త పద్ధతులు రోగులకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయి. హార్ట్‌లంగ్ మిషిన్‌లో మత్తు ఉంచే పద్ధతులతో పాటు శస్త్ర చికిత్స చేసే నైపుణ్యాల్లో కూడా కొత్త యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. పెద్ద వాళ్లలో మేజర్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్లలో కూడా 98 శాతం ఆపరేషన్లు విజయవంతమవుతున్నాయి. అయితే ఇంకా కొంతమంది రోగుల్లో గుండె, మూత్రపిండాలు దెబ్బతిన్న వారిలోనూ, రక్తప్రసరణ లోపాలున్న వాళ్లలో గుండె శస్త్ర చికిత్సల్లో కొంత రిస్క్ ఉంటుంది. గుండె ఆపినప్పుడు ఉపయోగించే ఆర్టిఫీిషియల్ సర్క్యూట్‌తో రక్తస్రావం, పక్షవాతం రావొచ్చు. అలాగే బ్రెస్ట్‌బోన్ మీద ఇచ్చే కోత మీద ఒక్కోసారి స్కాచ్ (మచ్చ) పెద్దదై (కిలాయిడ్) దురదలు పుట్టడంతోపాటు ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. గతంలో శస్త్ర చికిత్స జరిగిన తర్వాత రోగి ఒక వారం నుంచి పది రోజుల వరకూ ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది.
గుండె ఆపకుండానే బైపాస్ సర్జరీ
గతంలో మాదిరిగా రక్తనాళాలను కృత్రిమంగా హార్ట్‌లంగ్ మిషన్‌తో కలిపి, గుండె శస్త్ర చికిత్సలు చేయకుండా – గుండె కొట్టుకుంటున్నప్పుడే బైపాస్ సర్జరీ చేస్తున్నాం. పెద్ద కోతలు లేకుండా చిన్న రంధ్రాల్లో నుంచి పొట్టలో ల్యాప్రోస్కోప్ సర్జరీలను ఎలా చేస్తున్నారో, అలాగే కొన్ని గుండె శస్త్ర చికిత్సలను చేసే విధానాలు వచ్చాయి. ఇలా గుండెలో రంధ్రాలకు, కొన్ని రకాల కవాటాలను మార్చటానికి మినిమల్లీ ఇన్‌వేజ్ సర్జరీలు చేస్తున్నాం. థొరాకోస్కోపిక్ పద్ధతి ద్వారా రోబోట్స్‌ని ఉపయోగించి, గుండె చికిత్సలు విజయవంతం చేయొచ్చు. ఇలా చేయటం వల్ల రోగ శస్త్ర చికిత్స అయిన రెండు, మూడు రోజుల్లోనే రోగి ఇంటికి వెళ్లొచ్చు. గుండె రక్తనాళాల్లో బ్లాక్ అయినప్పుడు అక్కడ క్యాల్షియం పేరుకుపోయి గట్టిగా అవుతుంది. దీనిని అడ్వాన్స్ ప్రొసీజర్ అని అంటారు. క్యాల్షియం పేరుకుపోతే యాంజియోగ్రామ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి బ్లాక్స్ దగ్గరకు గైడింగ్ కేథటర్ వైర్‌ని పంపుతాము. యాంజియో ప్లాస్టీలో టార్పస్ స్క్రూ కదలికలతో క్యాల్షియం గట్టిపొరను చీల్చుకుంటూ ముందుకు వెళ్లి – రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించొచ్చు. గుండె కొట్టుకునే వేగం బాగా తగ్గిపోతున్నా, విఫలమయ్యే పరిస్థితి నెలకొన్నా, స్పృహతప్పే పరిస్థితి ఎదురవుతున్నా పేస్‌మేకర్లు అమర్చటం ద్వారా ఉపయోగం ఉంటుంది.
గుండెపోటు నివారణా చర్యలు
మధుమేహం మరియు కొలెస్ట్రాల్ నియంత్రణలో పెట్టుకోవాలి. డయాబెటిస్ మరియు అధిక కొవ్వు గల వ్యక్తులకు గుండెపోటు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 2-3 రెట్లు ఎక్కువ.
ధూమపానం మానేయాలి.. గుండెపోటుకు ప్రధాన కారణమైన ధూమపానం మానేస్తే బీపీ, గుండె సంబంధ వ్యాధులు దరిచేరవు.
శారీరక శ్రమ, వ్యాయామం తప్పనిసరి. రోజుకు 30 నిమిషాలు లేదా వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం, పనితీరు పెరిగి గుండె ప్రమాదాల నుంచి రక్షణ పొందుతుంది.
ప్రతి రోజూ ఆహారంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, నట్స్, డ్రై ఫ్రూట్స్, మొలకలు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి. ఇందులో కొవ్వు తక్కువగా ఉండి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
ఫాస్ట్ ఫుడ్స్, శీతల పానీయాలు, కేలరీలు ఎక్కువగా, పోషకాహారం తక్కువ వంటి వాటిని పరిమితంగా తీసుకోవడం మంచిది. మూడు, నాలుగు లీటర్ల నీటిని తీసుకోవాలి.
వృత్తిపరమైన, వ్యక్తిగత ఒత్తిళ్లు, అధికంగా ఆలోచనలు చేయడం మానేయాలి.
రోజులో కనీసం 7-8 గంటల పాటు నిద్రించడం వల్ల గుండెపోటు వచ్చే ముప్పును తగ్గించుకోవచ్చు.
వేరుశెనగ నూనె, కొబ్బరి నూనెలను తగిన మోతాదులో తీసుకోవాలి.
రెడ్ మీట్ (బీఫ్, పోర్క్, మటన్) వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదు. రిఫైండ్ ఆయిల్, మరిగించిన నూనెలను ఎక్కువగా వాడకూడదు.
అయితే సాధారణంగా 30శాతానికి పైగా గుండెపోటులు ఈసీజీ (జుజ+) పరీక్షల ద్వారానే నిర్ధారిస్తారు.
వీటితో పాటు :
ల్యాబ్ పరీక్షలు: లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, సి-రియాక్టివ్ ప్రోటీన్ (జ=ూ) పరీక్ష, కార్డియాక్ ట్రోపోనిన్‌లు (×, ు), క్రియేటిన్ కినేస్ (జఖ), మయోగ్లోబిన్.
అవగాహన కోసమే వరల్డ్ హార్ట్ డే..
వరల్డ్ హార్ట్ డే అనేది హృదయ సంబంధ వ్యాధుల గురించి అవగాహన పెంచడానికి.. గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి సెప్టెంబర్ 29న జరుపుకునే వార్షిక కార్యక్రమం. క్రమమైన వ్యాయామం, సమతుల్య ఆహారం, మంచి జీవనశైలి ద్వారా ఆరోగ్యకరమైన హృదయాన్ని కలిగి ఉంటాం. దీని ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి వివిధ సంస్థలు, వ్యక్తులు కలిసి వస్తారు. గుండె జబ్బుల వ్యాప్తిని తగ్గించడం, ఆరోగ్యకరమైన జీవన అలవాట్లను ప్రోత్సహించడం లక్ష్యం. ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతిఒక్కరూ గుండె జబ్బులు నివారించటానికి, గుండె ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటానికి, చురుకైన చర్యలు తీసుకోవాలని గుర్తుచేయటమే లక్ష్యంగా పనిచేస్తుంది.
ఇది కార్డియో వాస్కులర్ డిసీజ్ (జVణ) గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది ప్రపంచవ్యాప్త ప్రచారం, దీని ద్వారా సమాఖ్య జీవన భారానికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రజలను ఏకం చేస్తుంది. అలాగే హృదయ-ఆరోగ్యకరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ చర్యను ప్రేరేపిస్తుంది.
హృదయ సంబంధ వ్యాధులు, దాని నివారణ, ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై దాని ప్రభావం గురించి అవగాహన పెంచటానికి దోహదపడుతుంది.
గుండె జబ్బు, స్ట్రోక్‌తో సహా జVణ ప్రతి సంవత్సరం 17.9 మిలియన్ల మంది ప్రాణాలను బలిగొంటోంది. ఈ వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేసి, వ్యాధి తీవ్రతను నియంత్రించటానికి, నిరోధించటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు హైలెట్ చేస్తుంది వరల్డ్ హార్ట్ డే. ఏటేటా ఒక థీమ్‌తో దీనిని జరుపుకుంటారు.
గుండెపోటు రావడానికి కారణాలు
ఙ అస్తవ్యస్తమైన జీవన విధానం,
ఙ ఆహారపు అలవాట్లు గుండెపోటుకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.
వీటితో పాటు:
ఙ మధుమేహం
ఙ అధిక రక్తపోటు (బిపి)
ఙ అధిక బరువు (ఒబెసిటీ)ను కలిగి ఉండడం
ఙ శారీరక శ్రమ, వ్యాయామం చేయకపోవడం
ఙ వృత్తిపరమైన, వ్యక్తిగత ఒత్తిడి
ధూమపానం, మద్యం సేవించడం
అధిక కొవ్వు పదార్థాలు, మైదాతో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం
గ్యాస్ట్రిక్ నొప్పికి, గుండె నొప్పికి తేడా..
గుండె దగ్గర వచ్చే నొప్పి అలాగే గ్యాస్ట్రిక్ సమస్య వల్ల వచ్చే నొప్పి దాదాపు ఒకేలా ఉంటాయి. దీంతో చాలా మంది గ్యాస్ట్రిక్ సమస్యతో నొప్పి వచ్చినా అది గుండె నొప్పి ఏమో అని చాలా కంగారు పడుతుంటారు. వీటి గురించి తెలుసుకోవడం అవసరం.
గ్యాస్ట్రిక్ నొప్పి లక్షణాలు
ఙ గ్యాస్ట్రిక్ సమస్య సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత వస్తుంది.
ఙ గ్యాస్ట్రిక్ సమస్య ఉన్నవారిలో పొట్ట, ఛాతీలో నొప్పి వస్తుంది. ఆ నొప్పి వెన్నెముక వైపుగా వ్యాపిస్తుంది.
ఙ గొంతులో మంట.
ఙ కడుపు, ఛాతీ భాగంలో మండినట్లుగా ఉంటుంది.
ఙ తేన్పులు రావడం, కానీ ఇది ఉన్నంత మాత్రాన గుండె ఇబ్బంది లేదని చెప్పలేము. నొప్పి ఎక్కువగా ఉంటే గుండె / గ్యాస్ట్రిక్ నిపుణులను సంప్రదించటం మంచిది.
గుండెపోటు లక్షణాలు
గుండెపోటు లక్షణాల్లో గ్యాస్ట్రిక్ లక్షణాలతో పాటు..
ఙ గుండెలో ఆకస్మికంగా నొప్పి రావడమే కాక, తీవ్రమైన నొప్పి మెడ వరకూ పాకుతుంది.
ఙ ఆకస్మిక మైకము, వికారం.
ఙ శరీరం అంతా చెమటలు పట్టి చల్లగా అయిపోతుంది.
ఙ ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు.
ఙ ఛాతీలో నొప్పి ప్రారంభమై ఎడమ చేతి, ఎడమ దవడ మరియు కుడి చేతి వరకూ కూడా ఈ నొప్పి వ్యాపిస్తుంది.
ఙ నడిచేటప్పుడు ఛాతీలో నొప్పి, అసౌకర్యం కలిగినా దానిని గుండెపోటు లక్షణంగా పరిగణించొచ్చు.
ఙ గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుండె సాధారణం కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది.
ఇమేజింగ్ పరీక్షలు
ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ((ECG), ఎకోకార్డియోగ్రఫీ (2D Echo), కరోటిడ్ అల్ట్రా సౌండ్, కార్డియాక్ కరోనరీ యాంజియోగ్రఫీ,
CT calcium score etc
అలాగే 40 సంవత్సరాలు దాటిన వారు హెల్త్ చెకప్ చేయించుకోవటం మంచిది.
పై నియమాలను పాటించడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా చాలా వరకు నివారించుకోవడమే కాకుండా ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చు.
- డాక్టర్ ఎన్.మురళీకృష్ణ
Sr. consultant and Interventional Cardionlogist
MD, DNB,FCCP,FeCARD
FACC(USA), FSCAI,FES
సెల్ నెం: 9392911288 - సేకరణ: యడవల్లి శ్రీనివాసరావు