పాట

Apr 13,2025 13:32 #Poetry

ఏ మానవ విలువలనే

పల్లవి:
మానవ విలువలనే మంటగలిపినారా
పసి పిల్లల హతమార్చి మానవ మృగాలయ్యినారా
ఆ ఆ ఆ… ఓ ఓ ఓ…

చరణం 1:
ఎటు పోతుందీ సమాజం ఏమవునో రేపటి ఉదయం
కలుషితాల మనసులతోని ఆగమైన వింత లోకం
ఇది అమానుషం.. ఇది అరాచకం
తెలిసేదెన్నడూ న్యాయం గెలిచేదెన్నడు
//మానవ విలువలనే//

చరణం 2:
విషపూరిత బాటలు వేసి నడుస్తోంది నేటి సమాజం
అజ్ఞానపు చీకటిలోన నలుగుతోంది మానవదేహం
ఇది అమానుషం… ఇది అరాచకం
తెలిసేదెన్నడూ న్యాయం గెలిచేదెన్నడు
//మానవ విలువలనే//

చరణం 3:
కలహాల వేదనలోన కలత చెందే ఆ పసి హృదయం
నీకు నువ్వే శత్రువు అయ్యి నరుక్కున్న నీ శిరోహం
ఇది అమానుషం.. ఇది అరాచకం
తెలిసేదెన్నడూ న్యాయం గెలిచేదెన్నడు
//మానవ విలువలనే//

చరణం 4:
తల్లిదండ్రుల వేదనలోన గుండె కోత మిగిల్చినారా
ఆవేశ జ్వాలల్లోన బలి అయ్యెను భవిష్యత్‌ కాలం
ఇది అమానుషం… ఇది అరాచకం
తెలిసేదెన్నడూ న్యాయం గెలిచేదెన్నడు
//మానవ విలువలనే//

మెరుగు ప్రవీణ్‌
9989715531

➡️