గణతంత్ర దినమూ
కనుక ఈనాడు
‘ఎగురవే జెండా’
ఇక నీవుపాడు!!
అని ‘శివాని’నడుగ
తను పాడకుండా
‘ఎగురుతారు పక్షులు
ఎగురనా జెండా?’
అని విమర్శించెను
వెనువెంటనే తను!
అనిపించె మాకూ
అతి విచిత్రముగను!!
‘పిల్లి కళ్లు మూసి
పీట ఎక్కిందీ’
పాట వింటూ పొర
పాటు వుందందీ!’
‘కళ్లుమూసి’ కాదు
కళ్లు మూసుకొనీ’
అనీ వుండాలని
అన్నది ‘శివానీ’!!
మునుముందు ‘శివాని’
మన కళ్ల ముందు
విమర్శకురాలుగ
విఖ్యాతి జెందు!!
– ‘బాలబంధు’అలపర్తివెంకటసుబ్బారావు (కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)
9440805001