ఒక రోజు మా తాతగారు వర్షం కురుస్తుంటే ఆ వర్షంలో ఓ గిన్నె పెట్టి అది నిండినాక తెచ్చి, ఆ నీటిని తాగించారు. ఈ వర్షపు నీరు ఎన్ని వేలు, లక్షలు పెటినా బయట దొరకనివని చెప్పారు. వర్షం నీరైనా చాలా బాగున్నాయని ఆరోజు తెలిసింది. కనుక వర్షం పడేటప్పుడు నీటిని పట్టుకుని, అవసరాలకు వాడుకోవచ్చు. అలా కూడా నీరు పొదుపు చేయవచ్చు.
అంతేకాదు..మన ఇంటి పనులకు, వంటకి వాడుకున్న నీటిని మొక్కలకు పోయవచ్చు. కొంతమంది ట్యాపులు తిప్పి వదిలేస్తారు. బకెట్ నిండి, నీరు పోతున్నా పట్టించుకోరు. ట్యాంకులు నిండిన తర్వాత చాలామంది మోటర్లు ఆపకపోవడం వల్ల చాలా నీరు వృథా అవుతుంది. కనుక మనం ఐదు నిమిషాలు పొదుపు చేసినా…. ఆ నీరు చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి నీటిని అవసరమైన మేరకు వాడుకోవాలి. కనుక అందరూ నీటిని పొదుపు చేయండి….
ఎం. కావ్య శ్రీ,
5వ తరగతి,
అరవింద హైస్కూలు,
కుంచనపల్లి,
గుంటూరు జిల్లా.