హాయ్ ఫ్రెండ్స్, భగభగ మండే వేసవికాలం వచ్చేసింది. చెమటలు, ఉక్కపోతతో అసలు గాలి ఆడనివ్వకుండా చేసేస్తుంది. సూర్యుడు వేడితో దాడి చేస్తున్నాడు. అసలు ఎందుకు సంవత్సరం మొత్తం ఒకే కాలం ఉండదు. ఒకటి వేసవికాలం, రెండు వర్షాకాలం, మూడు శీతాకాలం ఎందుకు ఉంటాయి. సంవత్సరంలో నాలుగు నెలలు వర్షాలతో కాలు బయటపెట్టనివ్వదు. మరో నాలుగు నెలలు చలితో గడగడ వణికించింది నాయనా!. ఏంటి ఇంత చలి ఉంది.. అనుకోనేలా చేస్తుంది. ఇంకొక నాలుగు నెలలు.. అరేరు చలికాలం అప్పుడే వెళ్లిపోయిందా.. ఇంకా ఉంటే బాగుండు అనే అంత ఎండలు కాస్తున్నాయి బయట. ఈ ఎండాకాలంలో చలికాలం, వర్షాకాలము ఉండేలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏ కాలమైనా ఏంటి ఈ కాలం ఇలా ఉంవనిపిస్తుంది. ఆ కాలం వెళ్ళిపోయిన తర్వాత ఆ కాలమే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇలా విపరీతమైన ఎండలు, వానలు, చలి.. ఎందుకు విపరీతంగా ఉంటున్నాయి. ఏంటో ఫ్రెండ్స్ నాకు అసలు అర్థమే కావట్లేదు. మీరు ఏమైనా దీనికి సమాధానం చెప్పగలరా?
కె. భార్గవ్ సాయి
5వ తరగతి,
అరవింద హైస్కూలు,
కుంచనపల్లి.