జీవో 117 రద్దుచేసి డిఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలి

Jun 11,2024 18:47 #dsc

యూత్‌ ఎడ్యుకేషన్‌ ఎప్లారుమెంట్‌ అండ్‌ వెల్ఫేర్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, హిందీసేవాసదన్‌ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి షేక్‌ గైబువల్లి
ఎన్నికల సమయంలో హామీలో భాగంగా ముఖ్యమంత్రి హోదాలో డిఎస్సీ నోటిఫికేషన్‌పై మొదటి సంతకం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు జి.వో.నెం.117ను రద్దు చేసి తద్వారా ఏర్పడే ఖాళీలను డిఎస్సీ ద్వారా టీచరు పోస్టులు భర్తీ చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని యూత్‌ ఎడ్యుకేషన్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు, హిందీ సేవాసదన్‌ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి షేక్‌ గైబువల్లి కోరారు. గత ప్రభుత్వంలో విడుదల చేసిన జీవో 117 రాష్ట్రంలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్య అందించడంలో శాపంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పాఠశాలలో ఉపాధ్యాయులకు ఈ జీవోతో అధిక పనిభారం వుండటంతో విద్యార్థులకు సరైన న్యాయం చేసే పరిస్థితి లేదని తెలిపారు. జీవో 117ను రద్దు చేయడంతో సర్వీసులో వుండే ఉపాధ్యాయులకు పనిభారం తగ్గడం, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు డిఎస్సీ కోసం గత ఐదు సంవత్సరాలుగా వేచి చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేసిన వారవుతారని గైబువల్లి గుర్తుచేశారు.

➡️