రిటైర్డ్‌ ఉన్నతాధికారి నేతృత్వంలో ఆర్థికశాఖపై విచారణ?

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : గత ఐదేళ్ల కాలంలో ఆర్థికశాఖలో జరిగిన వ్యవహారాలపై రిటైర్డ్‌ ఉన్నతాధికారితో విచారణ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ దిశలో ఆదేశాలు వెలువడనున్నట్లు సమాచారం. బాబు కార్యాలయం నుండి దీనికి సంబంధించిన సంకేతాలు ఉన్నతాధికారలుకు అందడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. విచారణాధికారిగా ఎవరిని నియమించే అవకాశం ఉందన్న అంశంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. గతంలో ఆర్థికశాఖలో కీలక పదవిలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఒక అధికారికి ఈ బాధ్యతలు అప్పగిరచేలా ఆలోచన చేస్తున్నట్లు సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోరది. ఆ అధికారికి ఓఎస్‌డి లేదా సలహాదారు వంటి పదవి కట్టబెట్టే ఆలోచన కూడా ఉరదని తెలుస్తోరది. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించాలని, ఇతర శాఖ నుండి డిప్యుటేషన్‌ మీద ఆర్థికశాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న మరో అధికారిని సొంత శాఖకు పంపకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. వివిధ వనరుల ద్వారా ఖజానాకు చేరిన రాష్ట్ర ఆదాయంతో పాటు, పెద్ద మొత్తంలో చేసిన అప్పులను దేనికోసం ఖర్చు చేశారో అర్ధంకాని పరిస్థితి ఏర్పడిందని టిడిపి వర్గాలు అంటున్నాయి. భారీ మొత్తంలో ఉన్న ఈ నిధులు ఏమయ్యాయో తేల్చాల్సిఉందని వారు అంటున్నారు.

ఆ పేషీలపైనా నిఘా
ఆర్థికశాఖలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి పేషీల్లో గతం నురచి పనిచేసిన, పనిచేస్తున్న వారిపైనా నిఘా పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసిరది. ఇప్పటివరకు జరిగిన చెల్లిరపులు, ఇతర లావాదేవీల వ్యవహారాలు వారికి పూర్తిగా తెలిసే అవకాశాలు ఉరటాయని అభిప్రాయపడుతున్నారు.

➡️