రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి కేంద్రం రెడ్‌ సిగ్నల్ !

  • నిధులివ్వని బిజెపి సర్కార్‌
  • ఏళ్లు గడుస్తున్నా షెడ్డులకే పరిమితం
  • పట్టించుకోని రాష్ట్ర పాలకులు

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాయలసీమపై చిన్నచూపు చూస్తోంది. ఈ ప్రాంతంలతోని ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. కర్నూలు పరిధిలో రైల్వే కోచ్‌ల పునరుద్ధరణ ఫ్యాక్టరీ ఏర్పాటుపై తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోంది. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా తలపెట్టిన ఈ ఫ్యాక్టరీకి బిజెపి ప్రభుత్వ పదేళ్ల కాలంలో ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. దీంతో, ఫాక్టరీ పనులు షెడ్‌ల నిర్మాణానికే పరిమితమయ్యాయి. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి ఉంది. రాష్ట్ర పాలకులు కూడా పట్టించుకోకపోవడంతో ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో, ఉపాధి దొరుకుతుందని ఆశించిన కర్నూలు జిల్లా నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ఇ.తాండ్రపాడు, పంచలింగాలు, తెలంగాణ రాష్ట్రం జోగుళాంబగద్వాల జిల్లా ఆలంపూర్‌ రోడ్డు పరిధిలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రైల్వే కోచ్‌ పునరుద్ధరణ ఫ్యాక్టరీని మంజూరు చేసింది. దీని నిర్మాణానికి రూ.553 కోట్ల ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేశారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి 227 ఎకరాల భూమిని కేటాయించింది. 2014 ఫిబ్రవరి 23న అప్పటి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి కర్నూలు రైల్వే స్టేషన్‌ నుంచి ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. రూ.110 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. పలు లక్ష్యాలతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు. తుప్పు పట్టిన రైల్వే కోచ్‌లకు మెరుగులు దిద్దడం, యాంటీరొరోసివ్‌ ఫైబర్‌ గ్లాస్‌ టిష్యూలను మళ్లీ వేయడం, రైల్వే కోచ్‌లలో ఫ్లోరింగ్‌ పునరుద్ధరణ తదితర పనులు ఇక్కడ జరుగుతాయి. షాక్‌ అబ్జర్‌వర్లను మారుస్తారు. సైడ్‌ ప్యానెల్‌లను పునరుద్ధరిస్తారు. రీవైరింగ్‌ చేయడంతో పాటు అన్ని ఆల్టర్నేటివ్‌ బెల్ట్‌లు మారుస్తారు. మొత్తంగా రైల్వే కోచ్‌ పునరుద్ధరణకు అన్ని రకాల చర్యలను ఈ కోచ్‌ ఫ్యాక్టరీలో చేపడతారు. ఈ కోచ్‌ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసే అత్యాధునిక కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ యంత్రాలు, హెవీ మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ పరికరాలు సంవత్సరానికి 250 కోచ్‌లను పునరుద్ధరించేలా ప్రణాళికలు రూపొందించారు. నాన్‌ ఎసి రైల్వే కోచ్‌ పునరుద్ధరణకు రూ.36 లక్షలు, ఎసి కోచ్‌ పునరుద్ధరణకు రూ.45 లక్షల చొప్పున వెచ్చించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2019 నాటికి ఈ కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ తర్వాత కేంద్రంలో అధికారంలోకొచ్చిన బిజెపి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. గత పదేళ్లలో ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయితే వెయ్యి మంది యువతకు ఉపాధి లభిస్తుంది. మోడీ ప్రభుత్వం ఈ కోచ్‌ ఫ్యాక్టరీపై వివక్ష చూపుతున్నా రాష్ట్రంలోని గత టిడిపి ప్రభుత్వం, ఇప్పటి వైసిపి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించాయి. కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసేలా కేంద్రంతో ఎలాంటి సంప్రదింపులూ చేపట్టలేదు. త్వరగా పూర్తి చేయాలిరైల్వే కోచ్‌ పునరుద్ధరణ ఫ్యాక్టరీకి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయాలి. ఈ ఫ్యాక్టరీని నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి రాయలసీమ యువతకు ఉపాధి కల్పించాలి. మోడీ అధికారంలోకి వచ్చాకా ఉన్న సంస్థలను అమ్మడం తప్ప, కొత్త సంస్థలను ఏర్పాటు చేయడం లేదు. అందువల్లే కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం సాగడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధించడంలో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు, కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలం కావడంతో నేటికీ నిర్మాణ దశలోనే ఉంది. ఇది పూర్తయితే యువతకు ఉపాధి లభించేది. యువత ఆలోచించి ఈ ఎన్నికల్లో అలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలి.- ఇరిగినేని పుల్లారెడ్డి, పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులురూ.553 కోట్ల ఖర్చవుతుందని అప్పట్లో అంచనా వేశారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి 227 ఎకరాల భూమిని కేటాయించింది. 2014 ఫిబ్రవరి 23న అప్పటి కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి కర్నూలు రైల్వే స్టేషన్‌ నుంచి ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. రూ.110 కోట్లతో పనులు ప్రారంభమయ్యాయి. పలు లక్ష్యాలతో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టారు. తుప్పు పట్టిన రైల్వే కోచ్‌లకు మెరుగులు దిద్దడం, యాంటీరొరోసివ్‌ ఫైబర్‌ గ్లాస్‌ టిష్యూలను మళ్లీ వేయడం, రైల్వే కోచ్‌లలో ఫ్లోరింగ్‌ పునరుద్ధరణ తదితర పనులు ఇక్కడ జరుగుతాయి. షాక్‌ అబ్జర్‌వర్లను మారుస్తారు. సైడ్‌ ప్యానెల్‌లను పునరుద్ధరిస్తారు. రీవైరింగ్‌ చేయడంతో పాటు అన్ని ఆల్టర్నేటివ్‌ బెల్ట్‌లు మారుస్తారు. మొత్తంగా రైల్వే కోచ్‌ పునరుద్ధరణకు అన్ని రకాల చర్యలను ఈ కోచ్‌ ఫ్యాక్టరీలో చేపడతారు. ఈ కోచ్‌ ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసే అత్యాధునిక కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌ యంత్రాలు, హెవీ మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌ పరికరాలు సంవత్సరానికి 250 కోచ్‌లను పునరుద్ధరించేలా ప్రణాళికలు రూపొందించారు. నాన్‌ ఎసి రైల్వే కోచ్‌ పునరుద్ధరణకు రూ.36 లక్షలు, ఎసి కోచ్‌ పునరుద్ధరణకు రూ.45 లక్షల చొప్పున వెచ్చించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2019 నాటికి ఈ కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్‌ తర్వాత కేంద్రంలో అధికారంలోకొచ్చిన బిజెపి ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. గత పదేళ్లలో ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయితే వెయ్యి మంది యువతకు ఉపాధి లభిస్తుంది. మోడీ ప్రభుత్వం ఈ కోచ్‌ ఫ్యాక్టరీపై వివక్ష చూపుతున్నా రాష్ట్రంలోని గత టిడిపి ప్రభుత్వం, ఇప్పటి వైసిపి ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించాయి. కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసేలా కేంద్రంతో ఎలాంటి సంప్రదింపులూ చేపట్టలేదు. త్వరగా పూర్తి చేయాలిరైల్వే కోచ్‌ పునరుద్ధరణ ఫ్యాక్టరీకి పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయాలి. ఈ ఫ్యాక్టరీని నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి రాయలసీమ యువతకు ఉపాధి కల్పించాలి. మోడీ అధికారంలోకి వచ్చాకా ఉన్న సంస్థలను అమ్మడం తప్ప, కొత్త సంస్థలను ఏర్పాటు చేయడం లేదు. అందువల్లే కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మాణం సాగడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధించడంలో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు, కర్నూలు జిల్లా ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలం కావడంతో నేటికీ నిర్మాణ దశలోనే ఉంది. ఇది పూర్తయితే యువతకు ఉపాధి లభించేది. యువత ఆలోచించి ఈ ఎన్నికల్లో అలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలి.- ఇరిగినేని పుల్లారెడ్డి, పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు

➡️