లక్ష్యానికి దూరంగా ఆదాయం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్లు నత్తనడకన సాగుతున్నాయి. భారీ ఆదాయంపై ప్రభుత్వం ఆశలు పెరచుకున్నప్పటికీ అనేక ప్రారతాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గిపోతుండటం చర్చనీయాంశంగా మారింది.
ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నంలో కూడా ఇదే పరిస్థితి నెలకొరది. అమరావతిలో కొంత మెరుగ్గా ఉన్నా అదికూడా లక్ష్యాలకు అనుగుణంగా లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.13,500 కోట్లవరకు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయిరచుకురది. అయితే అక్టోబర్ వరకు రూ. 4,332 కోట్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం. 2022-23లో 26 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు జరగ్గా, ఈ ఏడాది అక్టోబర్ వరకు కేవలం 10 లక్షల వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చోటుచేసుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నురచి అక్టోబర్ 15వ తేదీ వరకు రు. 5,168కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇక జిల్లాల వారీగా చూస్తే రాష్ట్రంలోనే అతి పెద్ద నగరంగా ఉన్న విశాఖలో రిజిస్ట్రేషన్లు తిరోగమనంలో కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో విశాఖ పరిథిలో రు. 1,526 కోట్లు ఆదాయం వస్తురదని అరచనా వేయగా, సెప్టెరబర్ వరకు రు 747 కోట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే కేవలం 58 కోట్లు మాత్రమే ఆదాయం రావడం ఆశ్చర్యం కలిగిస్తోరది. అదే గతేడాది సెప్టెరబర్ వరకు 134 కోట్లు సమకూరిరది. అరటే గత ఏడాది కన్నా 56 శాతం తక్కువ ఆదాయం వచ్చినట్లు తేలిరది. అమరావతి రాజధాని పరిధిలో గత ఏడాది 112 కోట్లు ఆదాయం సమకూరగా, ఈ ఏడాది 257 కోట్లు రావడం విశేషం.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువే
ఈ ఏడాది తొలి త్రైమాసికంలో వచ్చిన ఆదాయాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తక్కువగానే కనిపిస్తోరది. గతేడాది జూన్‌కు, ఈ ఏడాది జూన్ వరకు ఆదాయాన్ని పరిశీలిస్తే రాష్ట్రం 23 శాతం మైనస్‌లో ఉరది. గత ఏడాది 2,403 కోట్లు రాగా, ఈ ఏడాది జూన్ వరకు 1,819 కోట్లు మాత్రమే వచ్చినట్లు తేలిరది. కర్నాటక 35 శాతం, మహారాష్ట్ర 22 శాతం, తమిళనాడు 13 శాతం ఎక్కువ ఆదాయంతో మురదంజలో ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ల ద్వారా నెల వారీ వచ్చిన ఆదాయం వివరాలు (రూ. కోట్లలో)
నెల 2023-24 2024-25
ఏప్రిల్ 669 663
మే 937 583
జూన్ 797 573
జూలై 816 741
ఆగస్టు 842 851
సెప్టెరబర్ 816 570
అక్టోబర్ 292 352
మొత్తం 5,169 4,333