‘నామినేటెడ్‌’పై కమలం పేచీ

Aug 31,2024 07:17 #BJP, #Nominated posts

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ప్రభుత్వం ఏర్పడి ముచ్చటగా వంద రోజులు కూడా కాకమురదే పదవుల పందేరంపై కూటమిలో ముసలం ప్రారంభమైనట్లు కనిపిస్తోంది. నాటినేటెడ్‌ పోస్టుల్లో ఎక్కువ వాటాపై బిజెపి నేతలు గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలిసింది. గెలిచిన స్థానాలతో సంబంధం లేకుండా నామినేటెడ్‌ పోస్టులను కోరుతుండడంతో తెలుగుదేశర ఇబ్బరదుల్లో పడుతున్నట్లు సమాచారం. ఈ అరశంపై ఇరు పార్టీల మధ్య చర్చలు కూడా పెద్దయెత్తున జరుగుతున్నట్లు తెలుస్తోరది. రాష్ట్రప్రభుత్వంలో దాదాపు 230 వరకు కీలక నామినేటెడ్‌ పోస్టులు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేరదుకు చంద్రబాబు ఇప్పటికే కసరత్తు ప్రారంభిరచారు. కూటమిలో గెలిచిన స్థానాల ప్రాతిపదికన పదవులు పంపకాలు చేయాలని నిర్ణయించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మొత్తం పదవుల్లో బిజెపికి 9 నురచి 10 శాతం పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ పార్టీ గడిచిన ఎన్నికల్లో ఎనిమిది శాసనసభ స్థానాలతోపాటు నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. జాతీయ స్థాయి పార్టీగా ఉన్న తమకు ఆ శాతం పదవులు చాలవని, మరిన్ని ఎక్కువ కేటాయించాలని బిజెపి పట్టుబడుతున్నట్లు తెలిసింది. దాదాపు 20 నురచి 25 శాతం వరకు పదవులు తమకు ఇవ్వాలని, అందులో అత్యరత కీలకమైన తిరుపతి తిరుమల దేవస్థానం ఛైర్మన్‌ పదవి కూడా ఉండాలని చెబుతున్నట్లు సమాచారం.

తమ్ముళ్ల ఒత్తిళ్లు
ఐదేళ్లుగా పదవులపై ఆశలు పెరచుకున్న తెలుగు తమ్ముళ్లు, నేతలకు ఈసారి ఎక్కువగా పదవులు ఇవ్వాల్సి వస్తుస్తుందన్న భావాన్ని చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు. జనసేన, బిజెపికి కలిపి 40 శాతం పదవులు ఇచ్చేస్తే ఇక తెలుగుదేశానికి కేవలం 140 పదవులు మాత్రమే మిగిలే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బిజెపి ఒత్తిళ్లకు తల వంచకూడదని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోరది. కాదు కూడదూ అనుకుంటే మరో మెలికకు ఆయన సిద్ధమవుతున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతు న్నాయి. జాతీయ స్థాయిలో కూడా వేల సంఖ్యలోనే నామినేటెడ్‌ పదవులు ఉంటాయి. రాష్ట్రంలో బిజెపికి ఎక్కువ పదవులు ఇవ్వాల్సి వస్తే కేంద్ర పదవుల్లో కూడా తమకు ఎక్కువ శాతం ఇవ్వాలన్న ప్రతిపాదనను సిఎం చంద్రబాబు తెరపైకి తీసుకొస్తు న్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బిజెపి నేతలకూ ఆయన సూచనప్రాయంగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఢిల్లీ పెద్దలతో చంద్రబాబు చర్చించేందుకు యోచిస్తున్నట్లు తెలిసింది.

➡️