- పుట్టిన తేదీ: 26 సెప్టెంబరు 1932
- జన్మస్థలం: మా, పంజాబ్ (ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)
- వివాహం: 14 సెప్టెంబరు 1958
- కుటుంబం: భార్య గురుశరణ్ కౌర్, కుమార్తెలు ఉపేందర్, దామన్ అమత్
- చదువు: పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బీఏ, 1954లో ఎంఏ పట్టా
- కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో ట్రైపోస్
- ఆక్స్‌ఫర్డ్ నుంచి ఎం.ఎ. డి.ఫిల్ (1962)
- హౌనరిస్ కాసా నుంచి డి.లిట్
- 1957-59 ఆర్థిక శాస్త్రంలో సీనియర్ అధ్యాపకులు
- 1959-63 రీడర్
- 1963-65 పంజాబ్ వర్సిటీ, చండీగఢ్‌లో ప్రొఫెసర్
- 1966-69 ఐరాసలో వాణిజ్య వ్యవహారాల అధికారి
- 1969-71 దిల్లీ వర్సిటీ, అంతర్జాతీయ వాణిజ్యంలో ఆచార్యలు
- 1972-76 ఆర్థకశాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారు
- 1976-80 రిజర్వు బ్యాంకు డైరెక్టర్, ఐడీబీఐ డైరెక్టర్, ఆసియా అభివద్ధి బ్యాంకు భారత్ విభాగం గవర్నర్, ఐబీఆర్‌డీ భారత విభాగం గవర్నర్
- 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు.
- 1991-96 మధ్య పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
- ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి హిందూయేతర వ్యక్తిగా మన్మోహన్ రికార్డు .శ్రీ మన్మోహన్ సింగ్ హయాంలో అత్యధిక జీడీపీ (10.8శాతం) వద్ధిరేటు నమోదైంది.
- మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది.
- 1987లో మన్మోహన్‌కు పద్మవిభూషణ్ ప్రదానం.
- ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వహించారు.
- ప్రధానిగా రోజూ 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేశారు.
- 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు.
- 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు.
- 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు.
- 1993, 94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు.
- 1998-2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
- 2010లో వరల్డ్ స్టేట్స్ మెన్ అవార్డు వరించింది.
- ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలోనూ మన్మోహన్‌కు చోటు దక్కింది.గొప్ప రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త
- మన్మోహన్ మృతిపై ప్రముఖుల సంతాపంగొప్ప రాజనీతిజ్ఞుడు, సునిశిత ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతి దేశానికి తీరనిలోటని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించారని, నిజాయితీ కలిగిన రాజకీయ వేత్తగా నిలబడ్డారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వేరొక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. మన్మోహన్‌సింగ్ ఏ బాధ్యత తీసుకున్నా… తనదైన ముద్ర వేశారని తెలిపారు. రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాదరెడ్డి, కందుల దుర్గేష్, కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర సంతాపం వ్యక్తం చేశారు. గ్లోబల్ మార్కెట్లో దేశాన్ని చేర్చడంలో ఆయన చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు.
- గవర్నర్ సంతాపం
గవర్నర్ మహ్మద్ అబ్దుల్ నజీర్ వేరొక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయని తెలిపారు.