పర్యాటకంలో పెట్టుబడుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా భూ బ్యాంకులు

  • భారీగా రాయితీలు
  • పిపిపి పద్దతిలో ఏర్పాటు
  • పాలసీని విడుదల చేసిన ప్రభుత్వం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఏర్పాటు చేసే టూరిస్టు ప్రాజెక్టుల కోసం భూములు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు నూతన టూరిజం పాలసీని ఆ శాఖ కార్యదర్శి వి.వినరుచంద్‌ మంగళవారం విడుదల చేశారు. భూములతో పాటు, భారీగా రాయితీలు’ స్పీడ్‌ ఆప్‌ డూయింగ్‌ బిజినెస్‌’ విధానంలో ఇవ్వనునన్నట్లు ఈ విధానంలో ప్రభుత్వం పేర్కొంది. ‘పర్యాటక, ఆతిధ్యరంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ‘ఇన్వెస్టెర్‌ ఫ్రెండ్లీ’గా భూములు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. దానిలో భాగంగా ఎటువంటి వివాదాలు లేని (ఎన్‌కంబరెన్స్‌ ఫ్రీ) భూ బ్యాంకులను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి, ప్రత్యేక కేటాయింపులు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’ అని ఈ 46 పేజీల విధానపత్రంలో ప్రభుత్వంలో పేర్కొంది. భూములతో పాటు భూ మార్పిడి చార్జీలు 100శాతం, స్టాంప్‌ డ్యూటీ 100శాతం మినహాయింపులు ఉంటుందని తెలిపింది. పరిశ్రమలకు అందించే విద్యుత్‌ టారిఫ్‌ ఈ ప్రాజెక్టులకు వర్తిసుందని, ఐదేళ్ల పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. ఏడేళ్ల పాటు రాష్ట్ర జిఎస్టి మినహాయింపు ఉంటుందని పేర్కొంది. రాష్ట్రస్థూల విలువ ఆధారిత(జివిఎ)పర్యాటక రంగ వాటాను 4.6శాతం నుంచి 8శాతం పెంచడం లక్ష్యమని పేర్కొంది. ఉద్యోగ కల్పన 12 నుంచి 15శాతానికి పెరుగుతుందని పేర్కొంది.

ఎక్కడెక్కడ ఏవి?

విశాఖపట్నం, అమరావతి (నాగార్జున కొండ)లను బుద్దిస్ట్‌ సర్య్కుట్‌గా అభివృద్ధి చేయనుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, నెల్లూరు, మచిలీపట్నం బీచ్‌ సర్క్యుట్‌లుగా పేర్కొంది. బీచ్‌ రిసార్ట్స్‌, విల్లాలను పిపిపి విధానంలో అభివృద్ధి చేయనుంది. అరకు-లంబసింగి, విశాఖపట్నం, రాజమండ్రి, కోనసీమ,విజయవాడ, శ్రీశైలం, గండికోట, తిరుపతి ప్రాంతాల్లో సి ప్లేన్‌ ప్రారంభించాలని నిర్ణయించింది.ఫిల్మ్‌ టూరిజం కోసం షూటింగ్‌ లోకేషన్లను గుర్తించాలని తెలిపింది. ప్రతి ఏటా నిర్వహించే ఈవెంట్లతో క్యాలెండర్‌ రూపొందించనుంది. ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో పర్యాటక పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళలు, పిల్లల కోసం మహిళా పోలీసులను ఏర్పాటు చేయాలని తెలిపారు. కొండపల్లి, కళాంకరి, ఏలూరు కార్పెట్స్‌, ఉప్పాడ శారీ, బుదితి బ్రాస్‌వేర్‌ వంటి కళాలను పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌ ప్రమోట్‌ చేయాలని తెలిపింది. ఈ పాలసీ ఐదేళ్ల వరకు గానీ, కొత్త పాలసీ వచ్చే వరకు అమల్లో ఉంటుందని వెల్లడించింది. ఈ అన్ని ప్రాంతాల్లో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపింది.

ఆరు కేటగిరీలు

టూరిజం ప్రాజెక్టుల కోసం ఆరు కేటగిరీలుగా పెట్టుబడులను ప్రభుత్వం ఆహ్వానించింది. కనీస పెట్టుబడిగా కోటి రూపాయలను నిర్ధేశించిన ప్రభుత్వం దానిని ‘సూక్ష్మ’ (మైక్రో) పెట్టుబడిగా పేర్కొంది. మూడు సంవత్సరాల్లో 250 నుండి 500 కోట్ల రూపాయలకు వరకు, నాలుగేళ్లలో 500 కోట్ల రూపాయల పైన పెట్టుబడులతో వచ్చే ప్రాజెక్టులను ‘మెగా’ ‘అల్ట్రా మెగా’ విభాగాలుగా గుర్తించి ‘టైలర్‌ మేడ్‌’గా రాయితీలను అందిస్తామని తెలిపింది.

ఇవి థీమ్‌లు…
బుద్దిస్ట్‌ సర్క్యూట్‌లు … 2
టెంపుల్‌ సర్క్యూట్‌లు… 10
బీచ్‌ సర్క్యూట్‌లు… 5
రివర్‌ క్రూయిజ్‌ సర్క్యూట్‌లు… 4
ఎకో టూరిజం సర్క్యూట్‌లు… 3
సీ క్రూయిజ్‌ సర్క్యూట్‌లు… 2
సీ ప్లేన్‌ సర్క్యూట్‌లు.

➡️