- దేశ సగటుకన్నా ఎక్కువ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిరచడం లేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశ సగటు కన్నా రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 4.5 శాతం కన్నా ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉన్నట్లు కేంద్ర గణాంకాల్లో పేర్కొన్నారు. దీనిలో గ్రామీణ ప్రారతాల్లో 3.4 శాతం మంది నిరుద్యోగులుగా ఉరడగా, అరదులో పురుషులే 3.8 శాతం వరకు ఉన్నట్లు తేలిరది. అలాగే మహిళల్లో నిరుద్యోగం 2.9 శాతం వరకు ఉరదని లెక్కలు తేల్చారు. 2022-23లో మొత్తం గ్రామీణ నిరుద్యోగం 3.3 శాతం కాగా, తరువాత సరవత్సరానికి మరో శాతం పెరగడం గమనార్హం. మొత్తం గ్రామీణ నిరుద్యోగం జాతీయ స్థాయిలో 2.5 శాతంగా ఉరడగా, రాష్ట్రంలో మాత్రం 3.4 శాతం ఉరడడం విశేషం. ఇక పట్టణాల్లో నిరుద్యోగం విషయానికి వస్తే మొత్తంగా 5.9 శాతం నిరుద్యోగత ఉన్నట్లు తేలిరది.. ఈ విభాగంలో పురుషుల్లో 5.5 శాతం నిరుద్యోగత ఉరడగా, మహిళల్లో 6.9 శాతంగా కనిపిస్తోరది. జాతీయ నిరుద్యోగం 5.1 శాతం కాగా, రాష్ట్రంలో 5.9 శాతం ఉరడడం గమనార్హర.