
న్యూఢిల్లీ : హోలీ రోజున స్పైస్‌జెట్‌కు చెందిన ఇద్దరు పైలట్లు కాక్‌పిట్‌లో స్వీట్లు, కూల్‌డ్రింక్స్‌తో ఎంజాయ్ చేసిన ఘటన ఢిల్లీ నుండి గువహటికి వెళ్తున్న విమానంలో జరిగింది. విమానం గాల్లో ఉండగానే.. హోలీ పండగ రోజున కాక్‌పిట్‌లో వారు వేడుక చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టి, ఇలా నిబంధనలు ఉల్లంఘించడాన్ని స్పైస్‌జెట్ తీవ్రంగా పరిగణించింది. భద్రతా నియమాలను ఉల్లంఘించినందుకుగానూ వారిపై చర్యలు తీసుకున్నట్లు స్పైస్ జెట్ తెలిపింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది.
ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పైలట్లపై విచారణ ప్రారంభించామని స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు. కాక్‌పిట్‌లో ఆహారం తీసుకునే విషయంలో కఠిన నియమావళి ఉందని, విమాన సిబ్బంది ఈ నిబంధనలకు కటుటబడి ఉండాలని అన్నారు. విచారణకు ఆదేశించామని.. వారిపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు.