కేకేఆర్‌-రాజస్థాన్‌… గుజరాత్‌-ఢిల్లీ మ్యాచ్‌ల తేదీలు మార్చిన బీసీసీఐ

Apr 2,2024 16:08 #2024 ipl, #BCCI, #kkr

కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌… గుజరాత్‌ టైటాన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ల తేదీలను మార్చినట్టు బిసిసిఐ నేడు ఓ ప్రకటనలో తెలిపింది. కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌-రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ ముందు పేర్కొన్న షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 17న జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌ను ఒక రోజు ముందుకు, అంటే ఏప్రిల్‌ 16కి మార్చారు. ఈ మ్యాచ్‌కు కోల్‌ కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా నిలవనుంది. అటు, గుజరాత్‌ టైటాన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ తొలుత పేర్కొన్న షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 16న జరగాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌ను ఆ మరుసటి రోజుకు, అంటే ఏప్రిల్‌ 17వ తేదీకి రీషెడ్యూల్‌ చేశారు. ఈ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.

➡️