మన యంగ్‌ టీమ్‌ అద్భుతం.. కోహ్లీ ప్రశంసలు

Feb 26,2024 16:59 #Cricket, #Sports, #Virat Kohli

రాంచీ మైదానం వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈసందర్భంగా టీమ్‌ఇండియా సిరీస్‌ విజయంపై విరాట్‌ కోహ్లీ స్పందించాడు. ”మన యంగ్‌ టీమ్‌ అద్భుతం చేసింది. సిరీస్‌ను కైవసం చేసుకుంది. పట్టుదల, సంకల్పం, కఠిన పరిస్థితులను ఎదుర్కొనే దఢత్వాన్ని కుర్రాళ్లు ప్రదర్శించారు” అని కోహ్లీ పోస్టు పెట్టాడు.

➡️