రస్సెల్‌ విధ్వంసం-మూడో టి20లో ఆసీస్‌పై గెలుపు

Feb 13,2024 22:30 #Sports

పెర్త్‌: వెస్టిండీస్‌ టి20 విధ్వంస ఆటగాడు ఆండీ రస్సెల్‌ సిక్సర్ల మోత మోగిండచంతో మూడో, చివరి మ్యాచ్‌లో ఆ జట్టు 37పరుగుల తేడాతో గెలిచింది. ఆండీస్‌ రస్సెల్‌(71నాటౌట్‌; 29బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సర్లు)కి తోడు రూథర్డ్‌ఫోర్డ్‌(67; 40బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. దీంతో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 220పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఆసీస్‌ బౌలర్లు బార్లెట్‌కు రెండు, బెహ్రెన్‌డార్ఫ్‌, జాన్సన్‌, హార్డ్లీ, జంపాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. అనంతరం డేవిడ్‌ వార్నర్‌(81), టిమ్‌ డేవిడ్‌(41) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించడంతో ఆసీస్‌ జట్టు 20 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 183పరుగులే చేయగల్గింది. విండీస్‌ బౌలర్లు ఛేస్‌, షెఫర్డ్‌కు రెండేసి, హొసైన్‌కు ఒక వికెట్‌ దక్కాయి. తొలి రెండు టి20లను నెగ్గి సిరీస్‌ను నెగ్గిన ఆసీస్‌ 2-1తో ట్రోఫీని కైవసం చేసుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఆండీ రస్సెల్‌కు, సిరీస్‌ వార్నర్‌కు లభించాయి.

➡️