2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో ముసురుకున్న వివాదాలు

2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో వినేశ్‌ ఫోగాట్‌కు తృటిలో పతకం చేజారినా.. ఈ ఒలింపిక్స్‌లో వివాదాస్పద నిర్ణయాలు అథ్లెట్లకు తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయి. అద్భుత ఫలితాలను ఎలా ఆస్వాదిస్తామో… అదే మాదిరిగా వివాదాస్పద విషయాలను తీసుకోవాల్సి వుంది. కొందరు ఫలితం యొక్క మార్పును చూసినా మరింత క్షోభకు గురవుతారు. మరికొందరు పతకాలకు చేరువై వాటిని కోల్పోవాల్సి కూడా వస్తుంది. వీరిలో అందరికంటే ముందు భారత రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ ఉండగా.. అల్జీరియా మహిళా బాక్సర్‌ ఇమానే ఖెలిఫ్‌ చివర్లో ఉన్నారు. బాక్సింగ్‌ మహిళల విభాగంలో ఇమానే ఖెలిఫ్‌, తైవాన్‌ బాక్సర్‌ లిన్‌-యు-టింగ్‌ ఇద్దరికీ ఈ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు దక్కాయి. లింగ వివక్షపై వీరిపై పత్రికల్లో సూటిపోటి రాతలతో వారిని తలదించుకొనేలా చేసినా.. నిర్వాహకులు అవేమీ పట్టించుకోకుండా తుదిపోరులో నెగ్గిన వీరిద్దరికీ స్వర్ణ పతకాలను అందజేశారు. 2023 ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌నుంచి వీరిని లింగ వివక్ష కారణంగా అనర్హత వేటు పడినా.. ఒలింపిక్స్‌లో వీరిద్దరూ ఆయా కేటగిరీల్లో స్వర్ణ పతకాలను సాధించారు. అయినా వీరు లింగ వివక్షపై తప్పుడు ఆరోపణలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

వినేశ్‌ ఫోగాట్‌..
రెజ్లింగ్‌ 50కిలోల ప్రిస్టైల్‌ విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫోగాట్‌ ఒలింపిక్స్‌లో సరిక్రొత్త చరిత్రను లిఖించింది. ఆ మరుసటిరోజు నాటికి 100 గ్రాముల అధిక బరువు కారణంగా పతకం కోల్పోవాల్సి వచ్చింది. అలాగే యునైటెడ్‌ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌(యుడబ్ల్యుడబ్ల్యు) ఆమెపై అనర్హత వేటు వేసింది. దీంతో ఆమెకు దక్కాల్సిన పతకాన్ని సెమీస్‌లో ఓడిన క్యూబా బాక్సర్‌ను ఫైనల్‌ బౌట్‌కు పంపించి పోటీ నిర్వహించి పతకాలను అందజేయడం కూడా జరిగిపోయింది. ఈ సంఘటనతో ఆమెకు కోట్లాదిమంది అభిమానులు మద్దతు లభించినా.. రాజకీయ కుట్రతో ఇది జరిగిందని ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌లో ఆందోళన చేశాయి. ‘కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌్‌(కాస్‌) మంగళవారం(13న) ఆమెను జరిగిన అన్యాయంపై తుది తీర్పు వెలువరించనుంది.

టామ్‌ క్రెయిగ్‌(ఆస్ట్రేలియా హాకీ ప్లేయర్‌)…
ఆస్ట్రేలియా పురుషుల హాకీజట్టు సభ్యుడు టామ్‌ క్రెయిగ్‌ ఒలింపిక్‌ క్రీడా గ్రామంలో కొకైన్‌తో పట్టుబడ్డాడు. అతడు 17ఏళ్ల యువకుని నుంచి కొకైన్‌ కొనుగోలు చేయడానికి ప్రయత్నించి పారిస్‌ పోలీసులకు దొరికాడు. దీంతో నిర్వాహకులు అతడికి హెచ్చరికలు జారీచేసి జట్టులో సభ్యునిగా కొనసాగేందుకు అనుమతిచ్చారు. కానీ ఆస్ట్రేలియన్‌ ఒలింపిక్‌ కమిటీ(ఎఓసి) అతడిని జట్టు నుంచి తప్పించి ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించడానికి అంగీకరించలేదు.

జోర్డాన్‌ ఛిల్లేస్‌(అమెరికా)..
అమెరికా మహిళా జిమ్నాస్ట్‌ జోర్డాన్‌ ఛిల్లెస్‌ కోచ్‌ న్యాయ నిర్ణేతలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాడు. ఛిల్లెస్‌ ప్రదర్శనకు, కాంస్య పతకం దక్కేందుకు 0.1పాయింట్ల వ్యత్యాసం ఉంది. దీంతో ఆమె కోచ్‌ సెసిలీ లాండి స్కోర్‌ను 0.1 పాయింట్లు జోడించమంటూ అంతర్జాతీయ జిమ్నా స్టిక్స్‌ ఫెడరే షన్‌(ఎఫ్‌ఐజి)కి సిఫార్సు చేశాడు. దీంతో ఆమె కాంస్య పతకానికి చేరువైంది. ఆ తర్వాత ఈ విషయం బయటకు రావడంతో ‘కాస్‌’ విచారణ చేపడుతున్నట్లు పేర్కొనడంతో ఆమె ఐదో స్థానానికి పరిమితమైంది.

లూనా అలోన్సే(పరాగ్వే)…
పరాగ్వేకు చెందిన సిమ్మర్‌ లూనా అలోన్సే అనుచిత వ్యాఖ్యల కారణంగా ఒలింపిక్స్‌ మధ్యలోనే బహిష్కరించబడింది. మహిళల 100మీ. బటర్‌ఫ్లై ఈవెంట్‌లో సెమీస్‌కు చేరడంలో విఫలమైన ఆమె.. బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు నెరుమార్‌, తానకు దగ్గరగా సంబంధాలు ఉన్నట్లు పత్రికలకు వెల్లడించింది. ఇదికాస్త సోషల్‌ మీడియాలో పెను దుమారాన్ని రేపడం.. ఆమెను పోటీల మధ్యలోనే స్వదేశానికి తిరిగి పంపించి వేయడం చక చకా జరిగిపోయాయి.

➡️