38th National Games: ఆంధ్రకు మరో రెండు కాంస్య పతకాలు

డెహ్రడూన్‌: 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్ర ప్రదేశ్‌కు మరో రెండు కాంస్యపతకాలు దక్కాయి. 7వ రోజు పురుషుల డబుల్స్‌ బ్యాడ్మింటన్‌, కనో స్లాలోమ్‌లో ఆంధ్రకు ఈ పతకాలు దక్కాయి. పురు షుల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో గౌస్‌-సాయి పవన్‌ జోడీ, మహిళల కనో స్లాలోమ్‌ కేటగిరీలో డి. చేతన భగవతి ఈ పతకాలు సాధించారు. వీరికి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్‌(ఎక్స్‌)లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ పతకాలు అథ్లెట్లకు ఇంకా అందజేయలేదు. 7వ రోజు పోటీలు ముగిసే సరికి పతకాల పరంగా కర్ణాటక అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. ఏడో రోజైన మంగళవారం పోటీలు ముగిసే సరికి కర్ణాటక 42పతకాలతో మరోసారి టాప్‌లోకి ఎగబాకింది. ఇందులో 22స్వర్ణాలు, 10రజత, 10 కాంస్యాలున్నాయి. రెండోస్థానంలో సర్వీసెస్‌కు 38 పతకాలు దక్కినా..జిందులో 19 స్వర్ణాలు మాత్రమే ఉన్నాయి. ఇక పతకాల పరంగా 61పతకాలు సాధించిన మహారాష్ట్రకు కేవలం 15 స్వర్ణాలే దక్కడంతో మూడోస్థానంలో కొనసాగుతోంది.

➡️