ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ.. సిరీస్‌ నుంచి జాక్‌ లీచ్‌ ఔట్‌

Feb 11,2024 16:40 #Cricket, #Sports

భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడుతున్న ఇంగ్లండ్‌ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్ట్‌ సందర్భంగా గాయపడ్డ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ తదుపరి సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. లీచ్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేసే ఉద్దేశం లేదని ఈసీబీ పేర్కొంది. ప్రస్తుతం జట్టుతో పాటు అబుదాబీలో ఉన్న లీచ్‌ 24 గంటల్లో స్వదేశానికి బయల్దేరతాడని ఈసీబీ తెలిపింది. లీచ్‌ ఇంగ్లండ్‌ మరియు సోమర్‌సెట్‌ మెడికల్‌ టీమ్‌ల పర్యవేక్షణలో ఉంటాడని తెలిపింది. మూడో టెస్ట్‌ రాజ్‌కోట్‌ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మొదలవుతుంది. కాగా, ఈ సిరీస్‌లో భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి సమంగా ఉన్నాయి.

➡️