T20 World Cup: కివీస్‌ను ఓడించిన ఆఫ్ఘన్

  • 84 పరుగుల తేడాతో గెలుపు
  • ఫజల్హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్ చోరో 4 వికెట్లు

టీ20 వరల్డ్ కప్2024లో న్యూజిలాండ్‌పై ఆఫ్ఘనిస్థాన్ 84 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు గుర్భాజ్‌(56 బంతుల్లో 80, 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఇబ్రహీం జద్రాన్‌(44), అజ్మతుల్లా (22)పరుగులతో రాణించారు. నబీ (0) రషీద్ ఖాన్ (6) కరీం జనత్ (1) గుల్బాదిన్ (0) నజీబుల్లా (1) బ్యాటింగ్ లో విఫలమయ్యారు. అనంతరం 160 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్‌కు ఇది రెండవ అత్యల్ప స్కోరుగా ఉంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (18) ఒక్కడే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. మిగతా బ్యాటర్లంతా ఫిన్ అలెన్ (0), డెవాన్ కాన్వే (8), కేన్ విలియమ్సన్ (9), డారిల్ మిచెల్ (5), మార్క్ చాప్మన్ (4), మైఖేల్ బ్రేస్‌వెల్ (0), మిచెల్ సాంట్నర్ (4), మాట్ హెన్రీ (12), ట్రెంట్ బౌల్ట్(3), లాకీ ఫెర్గూసన్ (2) విఫలమయ్యారు. అఫ్గాన్‌ బౌలర్లలో ఫజల్హక్ ఫారూఖీ, రషీద్ ఖాన్ చోరో 4 వికెట్లు పడగొట్టారు. నబీ 2 వికెట్లు తీశాడు. 80 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్బాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

➡️