న్యూఢిల్లీ : న్యూఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఐపిఎల్ ఫ్రాంచైజీ ప్రకటించింది. గతంలో ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్ … ప్రస్తుతం లఖ్‌నవూకు సారథ్యం వహిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్‌లో ఇప్పటివరకు ఒక్కసారీ విజేత కాలేకపోయింది. 17 సీజన్లలో కేవలం ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు వెళ్లగలిగింది. ఈ ఐపిఎల్ సీజన్‌లో రూ.16.50 కోట్లకు ఢిల్లీకి సొంతమైన అక్షర్.. కెప్టెన్, బౌలర్, బ్యాటర్‌గా ఆల్ రౌండ్ ప్రదర్శన ఇవ్వనున్నారు.
