- రూ.75కోట్లతో వేలానికి ఫ్రాంచైజీలు
- ప్రతి మ్యాచ్‌కు ఒక్కో ఆటగానికి రూ.7.5లక్షలు
ముంబయి: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్)లో ఆటగాళ్లు భారీ మొత్తంలోనూ మ్యాచ్ ఫీజులను అందుకోనున్నారు. శనివారం జరిగిన ఐపిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్‌లో ప్రతి ఫ్రాంచైజీ ఐదుగురు ఆటగాళ్లను అంటిపెట్టుకొనేందుకు అవకాశం కల్పించింది. అలాగే వచ్చే సీజన్‌కు ప్రతి ఫ్రాంచైజీ రూ.75కోట్ల మూల నిధితో వేలం బరిలోకి వెళ్లనున్నాయి. ఈ క్రమంలోనూ ప్రతి ఫ్రాంచైజీ తరఫున ఆడే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులను గవర్నింగ్ కౌన్సిల్ భారీగా పెంపుదల చేసింది. ఒక్కో ఆటగాడు మ్యాచ్ ఫీజు క్రింద రూ.7.5లక్షలు చొప్పున అందుకోనుండగా.. ఒక్కో ఫ్రాంచైజీ ఆళ్లందరికి కలిపి రూ.1.05కోట్లు ముట్టజెప్పనుంది. అలాగే ఆ ఫ్రాంచైజీ మొత్తం రూ.12.60కోట్ల మ్యాచ్ ఫీజును అందజేయనున్నట్లు నిర్వాహకులు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.