- అండర్-19 బాలికల జాతీయ వాలీబాల్ టోర్నీ
విజయవాడ: పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ జూనియర్ కాలేజీలో జరుగుతున్న స్కూల్ గేమ్స్ అండర్-19 బాలికల జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు హోరా హోరీగా జరుగు తున్నాయి. స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జిఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్‌జిఎఫ్‌ఏపి), కష్ణాజిల్లా అండర్-19 విభాగం సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. గ్రూప్-హెచ్‌లో ఉన్న ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ 25-12, 25-11, 25-13తో చండీఘడ్‌పై విజయం సాధించగా.. పంజాబ్ చేతిలో తెలంగాణ 25-18, 25-15, 25-18తో ఓటమిపాలైంది. దీంతో తెలంగాణ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లో నెగ్గి, రెండింటిలో ఓటమి పాలై నాకౌట్‌కు చేరడంలో విఫలమైంది. గ్రూప్-హెచ్‌లో ఆంధ్ర, మధ్యప్రదేశ్ జట్లు టాప్-2లో నిలిచి నాకౌట్‌కు చేరాయి. అలాగే ఢిల్లీ, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. తమిళనాడు, సిఐఎస్‌సిఈ జట్లు కూడా ప్రి క్వార్టర్స్‌కు చేరాయి. బుధవారం నుంచి నాకౌట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.