కల్నల్ సికె నాయుడు ట్రోఫీలో అదరగొట్టిన ఆంధ్రా

సెంచరీలు చేసిన వెంకట్ రాహుల్, హేమంత్ రెడ్డి, ఎస్.డి.ఎన్.వి. ప్రసాద్
మొదటి ఇన్నింగ్స్ లో ఆంధ్ర 544/8 డిక్లేర్
ప్రజాశక్తి – కడప : కల్నల్ సికె నాయుడు ట్రోఫీలో భాగంగా వైయస్ రాజారెడ్డి ఎసిఏ స్టేడియంలో ఆంధ్ర, హిమాచల్ ప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఆంధ్ర జట్టుకు చెందిన వెంకట రాహుల్, హేమంత్ రెడ్డి, ఎస్ డి ఎన్ వి ప్రసాద్ లు సెంచరీలు చేయడంతో ఆంధ్ర జట్టు మొదటి ఇన్నింగ్స్ లో  544 పరుగుల భారీ స్కూల్ సాధించింది. 5 వికెట్ల నష్టానికి 360 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆంధ్ర జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 135.5 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 544 పరుగుల వద్ద డిక్లేర్ ప్రకటించింది. ఆ జట్టు లోని హేమంత్ రెడ్డి 136, ఎస్.వెంకట్ రాహుల్ 197(267 బాల్స్), ఎస్ డి ఎన్ వి ప్రసాద్ 107  (నాటౌట్) పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన హిమాచల్ ప్రదేశ్ జట్టు రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 45.0 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ జట్టులోని యోగ్ దీప్ ఎస్ ఠాకూర్ 50, రాఘవ్ అంగ్రా 51, అమన్ ప్రీత్ వి సింగ్ 38 (నాటౌట్)  పరుగులు చేశారు. ఆంధ్ర జట్టులోని శ్రీకర్ వాసులు చెరో ఒక వికెట్ తీసుకున్నారు.

➡️