డెహ్రడూన్: 38వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు మరో పతకం దక్కింది. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆంధ్రకు చెందిన సత్యజ్యోతి కాంస్య పతకం చేజిక్కించుకుంది. దీంతో ఆంధ్ర పతకాల సంఖ్య మూడుకు చేరింది. బుధవారం జరిగిన 87 ప్లస్ కిలోల కేటగిరీలో విజయనగరం జిల్లాకు చెందిన టి.సత్యజ్యోతి విజయ ఢంకా మోగించింది. కాంస్యం పథకం సాధించి రాష్ట్రానికి గర్వ కారణంగా నిలిచింది. సత్యజ్యోతికి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ట్విటర్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఎపికి పురుషుల 67 కిలోల విభాగంలో నీలం రాజు, 71 కేజీల మహిళల విభాగంలో పల్లవి ఇప్పటికే స్వర్ణ పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే.
సత్తా చాటిన యువ షూటర్ ఒలింపియన్‌పై గెలుపుతో ఫైనల్‌కు
జాతీయ క్రీడల్లో ఓ సంచలనం నమోదైంది. పురుషుల 10మీ. ఎయిర్ పిస్టల్ విభాగంలో 15ఏళ్ల జొనాథన్ గవిన్ ఆంటోనీ టోక్యో ఒలింపియన్ సౌరబ్ చౌదరిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరాడు. ఇరువురు 578పాయింట్లతో సమంగా నిలువగా.. షూట్ ఆఫ్‌లో జొనాథన్ టార్గెట్‌కు దగ్గరగా చివరి బుల్టెన్‌ను కొట్టాడు. ఈ ఏడాది బోర్డు పరీక్షలకు సిద్ధమౌతున్న జొనాథన్‌కు ఈ గెలుపు ఎంతో ప్రత్యేమైనది. ఫైనల్‌కు చేరిన 8మందిలో సీనియర్ ఆటగాడు, జాతీయ క్రీడల స్వర్ణ పతక విజేత సరబ్‌జ్యోతి సింగ్ కూడా ఉన్నారు.