ICC Champions Trophy గెలుపు వేళ … అనుష్క విన్నింగ్‌ హగ్‌ ..!

క్రీడలు : టీమిండియా మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా నిలిచిన వేళ …. దేశవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానుల సంబరాలు మిన్నంటాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ విజయం సాధించింది. అటు మైదానంలోనూ భారత ఆటగాళ్లు తమతమ కుటుంబ సభ్యులతో కలిసి గెలుపు ఆనందాలను పంచుకున్నారు. ఈ క్రమంలో కోహ్లీ విరాట్‌ భార్య అనుష్క శర్మ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు విన్నింగ్‌ హగ్‌ ఇచ్చి విజయానందాన్ని పంచుకున్నారు. భారత్‌ విజయం అనంతరం రోహత్‌ శర్మ భార్య రితిక, కుమార్తె సమైరతో సంబరాలు చేసుకున్నారు. ఈ సమయంలో తన కుమార్తెను ముద్దు చేసున్న రోహిత్‌ను, అక్కడే ఉన్న అనుష్క పిలిచి అతడికి కంగ్రాట్స్‌ చెప్పి భారత జట్టును విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినందుకు విన్నింగ్‌ హగ్‌ ఇచ్చారు. ఆప్యాయంగా హత్తుకొని అతడిని అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో రోహిత్‌, విరాట్‌ అభిమానులు ఈ వీడియోను ట్రెండ్‌ చేస్తున్నారు. అలాగే … అభిమానులకు ఎంతో ఇష్టమైన కోహ్లీ అనుష్కల జంట మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్‌ గెలిచిన వెంటనే స్టాండ్‌లో ఉన్న అనుష్క దగ్గరకు కోహ్లీ పరిగెడుతూ వెళ్లారు. ఎమోషనల్‌గా ఆమెకు ఒక హగ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ అవుతున్నాయి.

➡️