ప్రజాశక్తి- విజయవాడ అర్బన్ : తమిళనాడులోని సాయిరామ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న కేలో ఇండియా ఎన్‌టిపిసి సౌత్ జోన్ ఓపెన్ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో రాష్ట్ర జట్టు ఛాంపియన్ షిప్‌గా నిలిచింది. ఈ మేరకు చెరుకూరి ఓల్లా ఆర్చరీ అకాడమీ అధ్యక్షులు చెరుకూరి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం… ఆంధ్రప్రదేశ్ జట్టు నుండి ప్రాతినిధ్యం వహించిన చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ క్రీడాకారులు రికర్వు, కాంపౌండ్ విభాగాలలో సత్తా చాటి ఛాంపియన్‌గా నిలిచారు. రికర్వు మహిళల విభాగంలో కొండపావులూరి యుక్తశ్రీ, ప్రథమ స్థానం సాధించారు. కాంపౌండ్ పురుషుల విభాగంలో కుందేరు వెంకటాద్రి ప్రథమ స్థానం సాధించి ఛాంపియన్‌గా నిలిచారు. టి.గణేష్ మణిరత్నం కాంపౌండ్ విభాగం, పురుషుల విభాగంలో మూడవ స్థానం సాధించారు. కర్రి సుష్మిత్ కాంపౌండ్ మహిళా విభాగంలో మూడవ స్థానం సాధించి కాంస్య పతకం సాధించారు. రికర్వు పురుషుల విభాగంలో జి.బైరాగినాయుడు రెండవ స్థానం సాధించి రజత పతకం సాధించారు
