భారత నంబర్‌ వన్‌ చెస్‌ ఆటగానిగా అర్జున్‌

  • ఫిడే ర్యాంకింగ్స్‌ విడుదల

లాసన్నె: అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య(ఫిడే) తాజా ర్యాంకింగ్స్‌లో భారత నంబర్‌వన్‌ ఆటగానిగా అర్జున్‌ ఎరిగిసి నిలిచాడు. ఫిడే సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అర్జున్‌ 2758.3పాయింట్లతో 7వ స్థానంలో నిలిచి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో మాజీ ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ విశ్వనాధన్‌ ఆనందన్‌ను వెనక్కి నెట్టి భారత టాప్‌ చెస్‌ ర్యాంక్‌కు చేరాడు. ఇంతకుముందు విశ్వనాధన్‌ ఆనంద్‌ తర్వాత టాప్‌-10లో నిలిచిన భారత ఆటగాళ్లలో డి. గుకేశ్‌, పి. హరికృష్ణ తర్వాత నాల్గో చెస్‌ ఆటగాడు అర్జున్‌ ఎరిగిసి మాత్రమే.
ఏప్రిల్‌-1న ఫిడే ప్రకటించిన ర్యాంకింగ్స్‌..
1. మాగస్‌ కార్ల్‌సన్‌(నార్వే) : 2830పాయింట్లు
2. ఫాబినో కరోనా(అమెరికా) : 2803 ,,
3. హికారు నకముర(అమెరికా) : 2789 ,,
4. ఎన్‌.అబ్డుసట్రోవ్‌(ఉబ్జెకిస్తాన్‌) : 2765 ,,
5. డింగ్‌ లెరెన్‌(చైనా) : 2762 ,,
6. అలిరెజా ఫిరోజా(ఫ్రాన్స్‌) : 2760 ,,
7. అర్జున్‌ ఎరిగాసి(భారత్‌) : 2758 ,,
8. ఇవాన్‌ నెపోంనిచ్ఛి(రష్యా) : 2758 ,,
9. వెస్ట్లీ సో(అమెరికా) : 2757 ,,
10. వురు యీ(చైనా) : 2755 ,,

➡️