ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తొలిసారి టాప్-10లోకి దూసుకొచ్చాడు. అతడు ఎనిమిది స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానంలో నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ నాలుగు స్థానాలు మెరుగై 35వ స్థానంలో నిలిచాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య నాలుగు స్థానాలు ఎగబాకి మూడో స్థానం దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు.
